సినీ నటి అపర్ణ నాయర్ అనుమానాస్పద మృతి - NEWS & POLITICAL : UPDATE NEWS

Breaking

Ad

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

adg

Friday, 1 September 2023

సినీ నటి అపర్ణ నాయర్ అనుమానాస్పద మృతి


ప్రముఖ మలయాళ సినీ నటి అపర్ణ నాయర్ (31) తిరువనంతపురంలోని తన ఇంట్లో అనుమానాస్పద రీతిలో శవమై కనిపించింది. తిరువనంతపురంలోని కరమణలోని తన నివాసంలో గురువారం సాయంత్రం నటి అపర్ణ విగత జీవిగా కనిపించింది. సంఘటన జరిగిన సమయంలో మృతురాలి తల్లి, సోదరి ఇద్దరూ ఇంట్లోనే ఉన్నారు. అపర్ణ తన బెడ్ రూంలో ఉరి వేసుకుని ఉన్నట్లు గమనించిన ఆమె కుటుంబ సభ్యులు హుటాహుటిన కిల్లిపాలెంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ పరీక్షించిన వైద్యులు అప్పటికే ఆమె మృతి చెందినట్లు ధృవీకరించారు. దీనిపై నటి తల్లి, సోదరి పోలీసులకు ఫిర్యాదు చేశారు. కరమన పోలీసులు అసహజ మరణంగా కేసు నమోదు చేసుకుని మృతికి గల కారణాలపై ఆరా తీస్తున్నారు. అపర్ణ మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. పోస్టుమార్టం అనంతరం వివరాలు వెల్లడిస్తామని ఓ పోలీస్ అధికారి తెలిపారు. అపర్ణ కుటుంబ సభ్యులు ఆమెను చంపి ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారని పోలీసులు అనుమానిస్తున్నారు. పైగా సంఘటన స్థలంలో ఎలాంటి సూసైడ్ నోట్ కనిపించకపోవడంతో పోలీసులు అనుమానం మరింత బలపడుతోంది. కెరీర్, కుటుంబానికి సంబంధించిన విషయాలు ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో పోస్టు చేస్తుంటుంది. మృతి చెందడానికి 11 గంటల ముందు కూడా తన చిన్న కూతురుకు సంబంధించిన వీడియోను పోస్టు చేసింది. 

No comments:

Post a Comment