భారీగా తగ్గిన వాణిజ్య గ్యాస్ సిలిండర్ ధర ! - NEWS & POLITICAL : UPDATE NEWS

Breaking

Ad

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

adg

Friday, 1 September 2023

భారీగా తగ్గిన వాణిజ్య గ్యాస్ సిలిండర్ ధర !


యిల్ మార్కెటింగ్ కంపెనీలు ఈ రోజు వాణిజ్య సిలిండర్ ధరలను రూ. 157 మేర తగ్గించేశాయి.  ఢిల్లీలో కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధర రూ. 1522 వద్ద ఉంది. ఇది వరకు ఈ రేటు రూ. 1680గా ఉండేది. ఇక కోల్‌కతాలో సిలిండర్ ధర రూ. 1636కు దిగి వచ్చింది. ఇది వరకు ఈ రేటు రూ. 1802గా ఉంది. ఇంకా ముంబైలో చూస్తే.. ఈ సిలిండర్ ధర ఇప్పుడు రూ. 1640 నుంచి రూ. 1482కు దిగి వచ్చింది. 4.2 కేజీల గ్యాస్ సిలిండర్ ధరను కూడా తగ్గించిన విషయం తెలిసిందే. ఈ నిర్ణయం ఆగస్ట్ 30 నుంచే అమలులోకి వచ్చింది.  ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు 14.2 కేజీల గ్యాస్ సిలిండర్ ధరను ఏకంగా రూ.200 మేర తగ్గించాయి. దీని వల్ల తెలుగు రాష్ట్రాల్లో సిలిండర్ ధర ఇప్పుడు రూ. 960కు దిగి వచ్చింది. ఇది వరకు ఈ రేటు రూ. 1160 వద్ద ఉండేది. దీని వల్ల చాలా బెనిఫిట్ లభిస్తోందని చెప్పుకోవచ్చు. ఉజ్వల స్కీమ్ కింద ప్రయోజనం పొందే వారికి అయితే ఇంకా అదనపు బెనిఫిట్ కూడా ఉంది. వీరికి సబ్సిడీ రూపంలో రూ.200 లభిస్తాయి. 

No comments:

Post a Comment