కవిత కేసు నవంబర్ 20కు వాయిదా

Telugu Lo Computer
0


బీఆర్ఎస్ నేత, ఎమ్మెల్సీ కవిత సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిటిషన్ పై విచారణను 2023 నవంబర్ 20వ తేదీకి వాయిదా వేసింది సుప్రీంకోర్టు. అప్పటి వరకు ఈడీ (ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్) కూడా నోటీసులు ఇవ్వొద్దని ధర్మాసనం స్పష్టం చేసింది. ఈ సందర్భంగా కోర్టు కొన్ని వ్యాఖ్యలు చేసింది. మహిళ అయినంత మాత్రాన విచారణ వద్దనలేమని వ్యాఖ్యనించింది. అయితే మహిళలకు కొన్ని రక్షణలు కల్పించాల్సి ఉంటుందని పేర్కొంది. నవంబర్ 20 వరకు కవితకు సమన్లు కూడా ఇవ్వొద్దని ఈడీని ఆదేశించింది. తదుపరి విచారణను నవంబర్ 20వ తేదీకి వాయిదా వేసింది. కాగా లిక్కర్ స్కామ్ కేసులో ఈడీ తనపై అసత్య ప్రచారం చేస్తోందని కవిత అత్యున్నత న్యాయస్థానంలో పిటిషన్ ధాఖలు చేశారు. 

Post a Comment

0Comments

Post a Comment (0)