గుండెపోటు - చిట్కాలు !

Telugu Lo Computer
0


యసు తో సంభందం లేకుండా ప్రతి ఒక్కరికి గుండెపోటు వస్తున్న సంగతి తెలిసిందే. చిన్న వయసులోనే హార్ట్ ఎటాక్, హార్ట్ ఫెయిల్ వంటి సమస్యలతో మరణిస్తున్నారు. అందుకే గుండె ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని నిపుణులు చెబుతున్నారు. గుండెను కాపాడుకునేందుకు కొన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవాలి. సరైన టైమ్ కు ఆహారాన్ని తీసుకోవాలి..అలాగే కొన్ని రకాల కొత్త అలవాట్లను కూడా నేర్చుకోవాలని వైద్య నిపుణులు చెబుతున్నారు. 

వ్యాయామం: ప్రస్తుత కాలంలో మన ఉద్యోగానికి మతి అవసరమే కానీ శరీరం కాదు. అలా అని ఏ పని చేయకుండా ఉండడం అంత మంచిది కాదు. ఎందుకంటే శరీరానికి శ్రమ తప్పనిసరి. పెద్ద పెద్ద పనులు కాకపోయినా.. ఇంట్లోనే చిన్న చిన్న పనులలో అయినా చేయి వేయాలి. అలాగే తేలికపాటి వ్యాయామాలు చేయాలి. లేదా వాకింగ్, రన్నింగ్ వంటివి కూడా పరవాలేదు. ఫలితంగా మీ గుండె ఆరోగ్యంగా ఉంటుంది..

స్ట్రెస్ ఫ్రీ: ముందుగా చెప్పుకున్నట్లే మన ఉద్యోగాలన్నీ కూడా మతి ఆధారంగా పనిచేసేవే. ఈ కారణంగానే మనకు తెలియకుండానే ఒత్తిడి కలుగుతుంది. దీనిని నియంత్రించకపోతే గుండెపోటకు కారణం కాగలదు. ఇంకా అనేక ఇతర ఆరోగ్య సమస్యలకు కూడా కారణం కాగలదు..

తాజా కూరగాయలు: గుండెను ఆరోగ్యంగా ఉంచేందుకు ఆకు పచ్చని కూరగాయలు చాలా మంచివి.. ఎందుకంటే ఆకుపచ్చని కూరగాయల్లో చాలా పోషక గుణాలుంటాయి. గుండెను ఆరోగ్యంగా ఉంచేందుకు ఇవి దోహదపడుతుంది. రోజూ ఆకుపచ్చని కూరగాయలు, హెల్తీ ఫుడ్ తప్పకుండా తీసుకోవాలి.. ఇకపోతే 40 సంవత్సరాలు దాటిన వారెవరైనా సరే ఎప్పటికప్పుడు వైద్య పరీక్షలు చేయించుకోవాలి. కొలెస్ట్రాల్, డయాబెటిస్, థైరాయిడ్, ఈసీజీ వంటి పరీక్షలు చేయించుకుని జాగ్రత్తపడాలి… అతిగా తినడం మానాలి.. సంతోషంగా ఉండటానికి ప్రయత్నించాలి.

Post a Comment

0Comments

Post a Comment (0)