ఆసియా కప్‌కు తిలక్ వర్మ ఎంపిక

Telugu Lo Computer
0


బీసీసీఐ చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్, హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్, కెప్టెన్ రోహిత్ శర్మ, ఇతర సెలెక్షన్ కమిటీ సభ్యులు న్యూఢిల్లీలో సమావేశమై ఆసియా కప్ కోసం 17 మందితో టీమిండియాను ప్రకటించింది. హైదరాబాద్ కుర్రాడు తిలక్ వర్మ జాక్ పాట్ కొట్టేశాడు. వెస్టిండీస్ తో జరిగిన టి20 సిరీస్ లో అదరగొట్టిన తిలక్ వర్మ ఆసియా కప్ లో ఆడనున్నాడు. ఐపీఎల్ లో గాయపడి ఆటకు దూరంగా ఉన్న కేఎల్ రాహుల్ జట్టులోకి పునరాగమనం చేశాడు. అతడితో పాటు శ్రేయస్ అయ్యర్ కూడా ఆసియా కప్ జట్టులో చోటు దక్కించుకున్నాడు. బుమ్రా పేస్ బౌలింగ్ దళానికి నాయకత్వం వహించనున్నాడు. సంజూ సామ్సన్ బ్యాకప్ ప్లేయర్ గా ఎంపికయ్యాడు. గాయాలతో ఆటకు దూరంగా ఉన్న బుమ్రా, కేఎల్ రాహుల్, శ్రేయస్ అయ్యర్ లు తిరిగి జట్టులోకి వచ్చారు. శ్రేయస్ అయ్యర్ ఫిట్ నెస్ పై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. శ్రేయస్ అయ్యర్ ను ఆసియా కప్ కోసం ఎంపిక చేయరని వార్తలు కూడా వినిపించాయి. అయితే శ్రేయస్ అయ్యర్ ను కూడా ఆసియా కప్ జట్టులో చోటు కల్పించారు. వెస్టిండీస్ తో జరిగిన టి20 సిరీస్ లో అదరగొట్టిన తిలక్ వర్మపై సెలెక్టర్లు నమ్మకం ఉంచారు. మిడిలార్డర్ లో నమ్మకమైన ప్లేయర్ అనే భావనతో అతడిని ఎంపిక చేశారు. లెఫ్టాండర్ కోసం వెతుకుతున్న బీసీసీఐకి తిలక్ వర్మ రూపంలో మంచి ప్లేయర్ దొరికాడనే చెప్పాలి. ఆసియా కప్ లో రాణిస్తే.. వన్డే ప్రపంచకప్ కూడా ఆడే అవకాశం ఉందని సెలెక్షన్ కమిటీ చీఫ్ అజిత్ అగార్కర్ పేర్కొన్నాడు. భారత జట్టు : రోహిత్ శర్మ (కెప్టెన్), శుబ్ మన్ గిల్, విరాట్ కోహ్లీ, తిలక్ వర్మ, శ్రేయస్ అయ్యర్, సూర్యకుమార్ యాదవ్, ఇషాన్ కిషన్, కేఎల్ రాహుల్, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, హార్దిక్ పాండ్యా, శార్దుల్ ఠాకూర్, కుల్దీప్ యాదవ్, బుమ్రా, సిరాజ్, షమీ, ప్రసిధ్ కృష్ణ, సంజూ సామ్సన్ (బ్యాకప్)

Post a Comment

0Comments

Post a Comment (0)