తైవాన్‌ వైపు చైనా యుద్ధ విమానాలు, నౌకలు

Telugu Lo Computer
0


తైవాన్‌ దిశగా చైనా మరోసారి పెద్దఎత్తున యుద్ధవిమానాలు, నౌకలను పంపింది. స్వీయ పాలనలో ఉన్న ఈ ద్వీపం తమ దేశంలో భాగమని చైనా చెబుతోంది. తైవాన్‌ వైపు తరచూ యుద్ధవిమానాలు, డ్రోన్లను పంపుతూ ఉద్రిక్తతలు సృష్టిస్తోంది. ఈ క్రమంలోనే బుధవారం ఉదయం నుంచి గురువారం ఉదయం వరకూ 33 యుద్ధవిమానాలు, 6 యుద్ధనౌకలను పంపినట్లు తైవాన్‌ వెల్లడించింది. ''జే 10, జే 16 యుద్ధ విమానాలు.. తైవాన్‌ నైరుతి దిశలో పయనించాయి. పది విమానాలు తైవాన్‌ జలసంధి మధ్య రేఖను (రెండు దేశాల మధ్య అనధికార సరిహద్దు) దాటాయి'' అని తైవాన్‌ రక్షణ శాఖ గురువారం తెలిపింది. చైనా సైనిక ఒత్తిడి పెరుగుతున్న నేపథ్యంలో తైవాన్‌ సైతం భారీగా యుద్ధవిమానాలు, ఆయుధాలను కొనుగోలు చేస్తోంది.

Post a Comment

0Comments

Post a Comment (0)