హైదరాబాద్ రూపు రేఖలు మారుస్తాం !

Telugu Lo Computer
0


హైదరాబాద్ రూపు రేఖలు రాబోయే కాలంలో మారిపోతాయని ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. హైదరాబాద్ ను అంతర్జాతీయ స్థాయిలో అభివృద్ధి చేసే యోచనలో సీఎం కేసీఆర్ ఉన్నట్లు తెలిపారు. కేటీఆర్ సోమవారం జరిగిన జీహెచ్ఎంసీ మీటింగ్ లో పాల్గొన్నారు. మూసీ నది సుందరీకరణ, నది ఒడ్డున ట్రామ్, నదిపై ఫ్లై ఓవర్లు నిర్మించడంపై చర్చించారు. పాతబస్తీ రోడ్ల విస్తరణ కోసం మంజూరు చేసిన రూ.150 కోట్లతో పనులు చేపట్టాలని అధికారులకు సూచించారు. మూసీ నదిపై వంతెనలకు త్వరలోనే శంకుస్థాపన చేస్తామన్నారు. ఔటర్ రింగ్ రోడ్డు ఒక వైపు నుంచి మరోవైపు ను కలుపుతూ సిటీ మధ్య నుంచి 4, 6 లేన్ల ఎక్స్ ప్రెస్ వే ప్రణాళిక పై కూడా ఆలోచిస్తున్నామన్నారు. ప్రైవేట్ డంప్ యార్డులు నిర్వహిస్తున్నవారి కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. అధికారులందరూ సమన్వయంతో పని చేయాలని సూచించారు. జవహర్ నగర్ డంప్ యార్డులో 8 వేల టన్నులు దాటి పోయిందన్న కేటీఆర్.. కొత్త డంప్ యార్డుల కోసం భూమిని గుర్తించాలని రంగారెడ్డి, సంగారెడ్డి అధికారులను ఆదేశించారు. డంప్ యార్డులను జనావాసాలకు దూరంగా, హైదరాబాద్ కు 50 ఏళ్ల వరకు ఇబ్బందులు లేకుండా చూసుకోవాలన్నారు. దుండిగల్, ఖానపూర్, ప్యారా నగర్ డంప్ యార్డ్ ల పై నివేదిక సమర్పించాలన్నారు. ఆ తర్వాత రంగారెడ్డి జిల్ల మన్నెగూడలో జరిగిన చేనేత దినోత్సవంలో పాల్గొన్నారు. 75 ఏళ్లు దాటిన చేనేత కార్మికులకు ప్రభుత్వమే బీమా కల్పిస్తుందని చెప్పారు. చేనేత కార్మికులకు 16 వేలకు పైగా మగ్గాలు ఇస్తున్నట్లు తెలిపారు. ఈ మగ్గాలకు తెలంగాణ చేనేత మగ్గం అని పేరు పెట్టినట్లు ప్రకటించారు. కేంద్ర ప్రభుత్వానికి చేనేత గురించి తెలియదన్నారు. చేనేత మీద కేంద్రం 5 శాతం జీఎస్టీ విధిస్తున్నట్లు కేటీఆర్ గుర్తు చేశారు. కేంద్రంలో సంకీర్ణ ప్రభుత్వమే వస్తుందని కేటీఆర్ జోస్యం చెప్పారు. కేంద్రంలో బీఆర్ఎస్ నిర్ణయాత్మక పాత్ర పోషిస్తుందని ఆశభావం వ్యక్తం చేశారు.

Post a Comment

0Comments

Post a Comment (0)