నటి సింధు కన్నుమూత

Telugu Lo Computer
0


మిళ నటి సింధు (44) క్యాన్సర్​ తో మృతి చెందారు. కొంతకాలంగా బెస్ట్‌ క్యాన్సర్‌తో బాధపడుతోన్న ఆమె సోమవారం వేకువ జామున 2.15 గంటలకు వలసరవక్కంలోని ఆమె నివాసంలో కన్నుమూశారు. తమిళనాడు కిలిపక్కంలోని ఆసుపత్రిలో బ్రెస్ట్ క్యాన్సర్‌కు (రొమ్ము క్యాన్సర్‌) చికిత్స పొందుతున్న ఆమె ఆసుపత్రి ఖర్చులను భరించలేక కొంతకాలం ఇంట్లోనే చికిత్స తీసుకున్నారు. ఈ క్రమంలో సింధు సోమవారం ఉదయం చెన్నైలోని తమ ఇంట్లో చనిపోయారు. నటి సింధూ మరణం పట్ల కోలీవుడ్‌ నటీనటులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. 14 ఏళ్ల వయసులోనే సింధుకు వివాహమైంది. ఏడాదికే ఓ బిడ్డకు జన్మనిచ్చింది. సినీ పరిశ్రమలో అడుగుపెట్టిన ఆమెకు 'అంగడి తెరు' (తెలుగులో షాపింగ్​ మాల్​) సినిమా మంచి గుర్తింపు తెచ్చింది. పలు సినిమాల్లో నటించినప్పటికీ ఆమెకు ఆర్థిక ఇబ్బందులు తప్పలేదు. పలు సందర్భాల్లో ఇచ్చిన ఇంటర్వ్యూల్లో తన వ్యక్తిగత జీవితం గురించి చెప్పి కన్నీరుపెట్టుకున్నారు సింధూ. 2010లో తెలుగు హీరోయిన్ అంజలి నటించిన 'షాపింగ్‌ మాల్' సినిమాలోనూ సింధు ఓ పాత్రలో నటించారు. ఆ తర్వాత పలు సినిమాల‍్లో ఆమె సహాయ పాత్రలు చేశారు. క్యాన్సర్ మహమ్మారి సింధూ జీవితాన్ని తలకిందులు చేసింది. 

Post a Comment

0Comments

Post a Comment (0)