స్వల్పంగా తగ్గిన బంగారం ధర

Telugu Lo Computer
0


దేశంలో బంగారం ధర స్వల్పంగా తగ్గింది.  10 గ్రాముల పసిడి (22 క్యారెట్లు) ధర రూ.100 తగ్గి, రూ. రూ. 55,050 కి చేరింది. మంగళవారం 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 55,150 గా ఉంది. 24 క్యారెట్ల బంగారం (10గ్రాములు) ధర కూడా రూ. 100 తగ్గి రూ. 60,060 కి చేరింది. క్రితం రోజు ఇది రూ. 60,160 గా ఉంది. దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల పసిడి ధర రూ. 55,200గాను.. 24 క్యారెట్ల బంగారం ధర రూ. 60,210గా ఉంది. కోల్​కతాలో ప్రస్తుతం 22 క్యారెట్ల పసిడి ధర రూ. 55,050 పలుకుతోంది. 24 క్యారెట్ల గోల్డ్​60,060గా ఉంది. ముంబై, బెంగళూరు, కేరళలోనూ ఇవే రేట్లు కొనసాగుతున్నాయి. ద్రవ్యోల్బణం, ఫెడ్​ వడ్డీ రేట్లు, ఆర్థిక అనిశ్చితి వంటి అంశాలు పసిడి ధరల్లో హెచ్చుతగ్గులకు కారణమవుతున్నాయని నిపుణులు చెబుతున్నారు.


Post a Comment

0Comments

Post a Comment (0)