వీడియో కాల్స్‌ కోసం వాట్సప్‌ కొత్త ఫీచర్లు

Telugu Lo Computer
0


వీడియో కాల్స్‌ కోసం స్క్రీన్‌ షేరింగ్‌, ల్యాండ్‌స్కేప్‌ మోడ్‌ ఫీచర్లను తీసుకొచ్చినట్లు మెటాకు చెందిన మెసేజింగ్‌ యాప్‌ వాట్సప్‌ వెల్లడించింది. ఇకపై వాట్సాప్‌ వీడియోకాల్‌ సమయంలో స్క్రీన్‌ను షేర్‌ చేసుకునే సౌలభ్యాన్ని తెచ్చినట్లు మెటా సీఈఓ మార్క్‌ జుకర్‌బర్గ్‌ ఫేస్‌బుక్‌ పోస్ట్‌లో తెలిపారు. వీడియోకాల్‌ సమయంలో 'షేర్‌' ఐకాన్‌పై క్లిక్‌ చేయడం ద్వారా ఈ ఫీచర్‌ను పొందొచ్చు. అదేవిధంగా ల్యాండ్‌స్కేప్‌ మోడ్‌లో వెడల్పుగా చిత్రాన్ని తిలకించొచ్చని తెలిపారు.

Post a Comment

0Comments

Post a Comment (0)