ఇమ్రాన్​ ఖాన్​ పై ఐదేళ్లపాటు ఎన్నికల్లో పోటీ చేయకుండా అనర్హత వేటు !

Telugu Lo Computer
0


పాకిస్థాన్​ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్​కు మరో షాక్ తగిలింది. ఆయన ఐదేళ్లపాటు ఎన్నికల్లో పోటీ చేయకుండా అనర్హత వేటు వేసింది పాకిస్థాన్ ఎన్నికల సంఘం. తోషాఖానా కేసులో ఇమ్రాన్​కు కోర్టు మూడేళ్ల జైలు శిక్ష విధించడం వల్ల ఎన్నికల సంఘం ఈ నిర్ణయం తీసుకుంది. పాకిస్థాన్ పార్లమెంటు గడువు ఆగస్టు 12 వరకు ఉండగా.. ఆగస్టు 9న దిగువ సభ రద్దుకు సిఫార్సు చేస్తానని ఇప్పటికే ఆ దేశ ప్రధాని షెహబాజ్ షరీఫ్ ప్రకటించారు. మరోవైపు, ట్రయల్‌ కోర్టు తీర్పును సవాల్ చేస్తూ ఇమ్రాన్ ఖాన్ ఇస్లామాబాద్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. తమ వాదనలు వినకుండానే ట్రయల్ కోర్టు జడ్జి తీర్పు ఇచ్చారని.. ఇమ్రాన్‌ పిటిషన్‌లో పేర్కొన్నారు. తన న్యాయవాది ఆలస్యంగా వచ్చారనే నెపంతో జడ్జి వాదనలను వినడానికి నిరాకరించారని తెలిపారు.

Post a Comment

0Comments

Post a Comment (0)