ముఖాన్ని కాంతివంతంగా చేసుకోవడానికి ఇంటి చిట్కాలు ! - NEWS & POLITICAL : UPDATE NEWS

Breaking

Ad

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

adg

Wednesday, 2 August 2023

ముఖాన్ని కాంతివంతంగా చేసుకోవడానికి ఇంటి చిట్కాలు !


టేబుల్‌ స్పూను పంచదార పొడిలో స్పూను వేడినీళ్లు పోసి కలపాలి. దీన్లో రెండు టీస్పూన్ల పచ్చిపాలు, స్పూను అలోవెరా జెల్‌ వేసి కలపాలి. శుభ్రంగా కడిగిన ముఖానికి ఈ మిశ్రమాన్ని రాసి మర్దన చేయాలి. పది నిమిషాలపాటు ఆరనిచ్చి కడిగేయాలి. వారానికి మూడుసార్లు ఈ ప్యాక్‌ వేయడం వల్ల తేమ అంది, చర్మం పట్టులా నిగారింపుతో మెరుపులీనుతూ కనిపిస్తుంది. మన కూరల్లో వాడే జీలకర్ర ముఖవర్ఛస్సుకు చాలా బాగా ఉపయోగపడుతుంది. జీకర్ర రెండు కప్పుల నీళ్లో మరిగించి ఆ నీటితో ముఖం కడుక్కుంటే వృద్ధాప్య లక్షణాలను నివారిస్తుంది. ఇందులో ఉండే విటమిన్‌ 'ఈ' వృద్ధాప్యానికి కారణమయ్యే ఫ్రీ రాడికల్స్‌ను ఎదుర్కోవడానికి యాంటీఆక్సిడెంట్‌గా పనిచేస్తుంది. అంతే కాదు! జీలకర్ర గింజలు మొటిమలు, వాటి తాలుకా మచ్చలు, తామర, సోరియాసిస్ వంటి చర్మ రుగ్మతలకు చికిత్స చేయడంలో సహాయపడుతుంది. టాక్సిన్స్‌ను కూడా తొలగిస్తుంది తద్వారా చందమామలాంటి ప్రకాశవంతమైన ముఖం మీ సొంతం అవుతుంది. మంచి ఫలితాల కోసం క్రమం తప్పకుండా చేయండి. అలాగే ముఖం అందంగా ఉన్న జుట్టు డల్‌గా ఊడిపోతున్న అందంగా కనిపించరు కదా వీటితో పాటు మీ మిమల్ని మరింత అందంగా కనిపించేలా చేసేందుకు మీ శిరోజాలను ఈ చిట్కాతో సంరక్షించుకోండి. మరుగుతున్న రెండు గ్లాసుల నీటిలో మూడు టేబుల్‌ స్పూన్ల టీపొడి, పది గులాబీ పువ్వులు వేసి పదినిమిషాలపాటు మరిగించాలి. తరువాత చల్లారనిచ్చి వడగట్టి డికాషన్‌ను సీసాలో పోయాలి. తలస్నానం చేసిన జుట్టుకు ఈ డికాషన్‌ను పట్టించి, టవల్‌ చుట్టుకోవాలి. నీటితో కడగకూడదు. ఇది కండీషనర్‌లా పనిచేసి జుట్టు రాలడాన్ని తగ్గిస్తుంది.  https://t.me/offerbazaramzon

No comments:

Post a Comment