రేపటి నుంచి విద్యుత్ ఉద్యోగుల సమ్మె

Telugu Lo Computer
0


ఆంధ్రప్రదేశ్ విద్యుత్ ఉద్యోగుల సమస్యలు, డిమాండ్ల పరిష్కారంపై ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరిని వ్యతిరేకిస్తూ ఆగస్ట్ 10వ తేది నుంచి సమ్మెకు దిగుతన్నామని ప్రకటించారు. బుధవారం  అర్ధరాత్రి నుంచి ఏపీలో విద్యుత్ ఉద్యోగులు నిరవధిక సమ్మెకు దిగితున్నట్లుగా జేఏసీ ప్రకటించింది. పెండింగ్‌లో ఉన్న బకాయిలు చెల్లించడంతో పాటు కాంట్రాక్ట్‌ ఉద్యోగులను పర్మినెంట్ చేయాలని ఇప్పటికే ప్రభుత్వంతో పలుమార్లు చర్చలు జరిపినప్పటికి ప్రయోజనం కనిపించకపోవడంతో ఈవిధంగా సమ్మెబాట పట్టారు. దీర్ఘకాలికంగా పెండింగ్‌లో ఉన్న 12 డిమాండ్లను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ గత నెల 21వ తేది నుంచే నిరసన కార్యక్రమాలు చేపడతామని పిలుపునిచ్చింది. ప్రభుత్వంతో జరిపిన చర్చలు విఫలమవడంతో మెరుపు సమ్మెకు దిగుతున్నట్లుగా ప్రకటించింది విద్యుత్ ఉద్యోగుల జేఏసీ. రేపటి నుంచి చేపట్టబోయే నిరవధిక సమ్మె పోస్టర్లను విడుదల చేసిన ఉద్యోగులు ఈ అర్ధరాత్రి నుంచే విద్యుత్‌శాఖలోని వాచ్‌మెన్ దగ్గర నుంచి ఇంజనీర్ వరకు అందరూ పాల్గొంటారని ప్రకటించడం జరిగింది. మరోవైపు ఉద్యోగ సంఘాల సమ్మెతో ప్రజలకు ఎలాంటి అసౌకర్యం, ఇబ్బందులు కలిగినా యాజమాన్యమే బాధ్యత వహించాలని ప్రభుత్వం ఇప్పటికే తెలిపింది. అలాగే విద్యుత్ ఉద్యోగులు సమ్మెకు దిగితే ఎస్మా ప్రయోగిస్తామని హెచ్చరించడం కూడా జరిగింది. రెండేళ్లుగా తమ సమస్యలు పరిష్కరిస్తామని చెబుతూ వస్తున్న ప్రభుత్వం వాటిని ఆచరణలో పెట్టకపోవడం వల్లే సమ్మెకు దిగుతున్నట్లు విద్యుత్‌శాఖ ఉద్యోగ జేఏసీ తెలిపింది. ఉద్యోగుల నిరవధిక సమ్మె నేపధ్యంలో ప్రతీ విద్యుత్‌శాఖ కార్యాలయాల దగ్గర, సబ్ స్టేషన్‌ల దగ్గర  ప్రభుత్వం భద్రత ఏర్పాటు చేసింది. నాలుగేళ్ల వైసీపీ ప్రభుత్వ పాలనలో ఒక్కొక్క శాఖ ఉద్యోగులు తమ డిమాండ్ల పరిష్కారం కోసం ప్రభుత్వంపై తాడోపేడోకి దిగుతూనే ఉన్నారు. ఇప్పుడు విద్యుత్‌ శాఖ ఉద్యోగుల వంతు వచ్చింది. ఈ సమస్యను జగన్‌ సర్కారు ఏ విధంగా పరిష్కరిస్తుందో చూడాలి.

Post a Comment

0Comments

Post a Comment (0)