లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు !

Telugu Lo Computer
0


దయం ఫ్లాట్ ప్రారంభంతో మెుదలైన దేశీయ స్టాక్ మార్కెట్లు ఇంట్రాడేలో పుంజుకున్నాయి. దీంతో అన్ని రంగాల షేర్లు మంచి లాభాల్లో ట్రేడింగ్ కొనసాగించాయి. మార్కెట్లు ముగిసే సమయంలో బెంచ్ మార్క్ సూచీ సెన్సెక్స్ 267 పాయింట్ల లాభపడగా, నిఫ్టీ 83 పాయింట్ల మేర లాభంలో నేడు ట్రేడింగ్ ముగించింది. ఇదే క్రమంలో నిఫ్టీ బ్యాంక్ సూచీ 151 పాయింట్లు, నిఫ్టీ మిడ్ క్యాప్ సూచీ 311 పాయింట్ల మేర లాభాలతో ట్రేడింగ్ ముగించాయి. ప్రధానంగా అన్ని రంగాల షేర్లలో ఇన్వెస్టర్ల నుంచి కొనుగోళ్ల మద్దతు లభించటం నేటి లాభాలకు కారణంగా మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. ఎన్ఎస్ఈలో బజాజ్ ఫైనాన్స్, పవర్ గ్రిడ్, అదానీ పోర్ట్స్, అదానీ ఎంటర్ ప్రైజెస్, హిందాల్కొ, ఎన్టీపీసీ, ఇండస్ఇండ్ బ్యాంక్, భారతీ ఎయిర్ టెల్, అపోలో హాస్పిటల్స్, ఐటీసీ, కోల్ ఇండియా, ఎల్ టిఐఎమ్, బజాజ్ ఫిన్ సర్వ్, ఇన్ఫోసిస్, యూపీఎల్, టీసీఎస్, జేఎస్డబ్ల్యూ స్టీల్, టైటాన్, యాక్సిస్ బ్యాంక్, నెస్లే కంపెనీల షేర్లు లాభాల్లో ట్రేడింగ్ ముగించి టాప్ గెయినర్లుగా నిలిచాయి. ఇదే క్రమంలో జియో ఫిన్, రిలయన్స్, మహీంద్రా అండ్ మహీంద్రా, బ్రిటానియా, బజాజ్ ఆటో, ఎస్బీఐ లైఫ్, ఎస్బీఐ, బీపీసీఎల్, సిప్లా, మారుతీ, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, హెచ్డీఎఫ్సీ లైఫ్, అల్ట్రాటెక్ సిమెంట్స్ కంపెనీల షేర్లు నష్టాల్లో ట్రేడింగ్ ముగించి టాప్ లూజర్లుగా నిలిచాయి.

Post a Comment

0Comments

Post a Comment (0)