రష్యాపై ఉక్రెయిన్‌ డ్రోన్ల దాడి ! - NEWS & POLITICAL : UPDATE NEWS

Breaking

Ad

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

adg

Wednesday, 23 August 2023

రష్యాపై ఉక్రెయిన్‌ డ్రోన్ల దాడి !


క్రెయిన్‌ రష్యాపై డ్రోన్లతో దాడి చేసింది. మాస్కో శివార్లలో ఉక్రెయిన్‌ డ్రోన్లతో దాడి చేయగా వాటిని కూల్చేసినట్టు రష్యా సైన్యం ప్రకటించింది. డ్రోన్ల దాడితో అప్రమత్తమై రష్యా రక్షణ శాఖ నాలుగు ప్రధాన ఎయిర్‌పోర్టుల్లో రాకపోకలను నిలిపివేసినట్లు తెలిపింది. మాస్కో సరిహద్దుల్లోని బ్రియాన్‌స్క్‌ ప్రాంతంలో క్రాస్నోగోర్స్క్ పట్టణంలో నాలుగు డ్రోన్లు ప్రవేశించడంతో వాటిని రష్యా సైన్యం కూల్చివేసింది. గగనతలాన్ని లక్ష్యంగా చేసుకుని ఉక్రెయిన్ ఈ దాడులకు పాల్పడింది. ముందు జాగ్రత్తగా వ్నుకోవో, షెరెమెట్యెవో, డొమోడెడెవో, జుకోవ్‌స్కీ ఎయిర్‌పోర్టుల్లో విమానాల రాకపోకలను రష్యా అధికారులు నిలిపివేశారు. చిన్న దేశంగా ఉన్న ఉక్రెయిన్ ఏమీ చేయలేదని రష్యా భావిస్తూ వస్తోంది.. కానీ ఇతర దేశాల సహకారంతో ఉక్రెయిన్‌ డ్రోన్ల దాడులను ముమ్మరం చేసింది. గత ఆదివారం జరిగిన దాడుల్లో డ్రోన్లు రైల్వే స్టేషన్ పైకప్పు భాగంలోకి దూసుకుపోగా ఐదుగురు ప్రాణాలు కోలోయారని ఉక్రెయిన్‌ సైన్యం ప్రకటించింది. ఆ సమయంలో రైల్వే స్టేషన్లో సుమారు 50 మంది వరకు ఉన్నారు. వారిలో 5 మంది మరణించారు.. మరికొంత మంది గాయపడ్డారు. కొందరు ఆసుపత్రిలో మరణించారని తెలిపారు. అంతకుముందు ఇదే కుర్స్క్ ప్రాంతానికి చెందిన వొల్ఫినోలో కూడా ఉక్రెయిన్ క్షిపణులతో విరుచుకుపడింది. ఆ తరువాత కాలంలో మరింత బలాన్ని పుంజుకున్న ఉక్రెయిన్ యుద్ధం తొలినాళ్లలో కోల్పోయిన ఒక్కో ప్రాంతాన్ని మెల్లగా తిరిగి చేజిక్కించుకుంటోంది. ఉక్రెయిన్‌ డ్రోన్ల దాడిని రష్యా ఊహించకపోయినప్పటికీ.. జరిగిన దాడిని తిప్పి కొట్టడానికి తగిన ప్రణాళికను రూపొందించుకుంటున్నట్టు మీడియా సంస్థలు ప్రకటించాయి. 

No comments:

Post a Comment