నా న్యూడ్‌ వీడియోలు రూ.47లక్షలకు అమ్ముకున్నాడు !

Telugu Lo Computer
0


తన న్యూడ్‌ వీడియోలను తన మాజీ భర్త అదిల్‌ ఖాన్‌ దురానీ రూ.47 లక్షలకు అమ్ముకున్నాడని బాలీవుడ్‌ నటి రాఖీ సావంత్ ఆరోపించింది. ఇటీవలే అదిల్‌ ఖాన్‌ దురానీని రహస్యంగా వివాహం చేసుకుంది. ఆ తర్వాత కొన్ని రోజులకే అతడితో విడిపోయింది. ఈ క్రమంలో దురానీపై పలు కేసులు కూడా పెట్టింది. 'నేను బాత్‌రూమ్‌లో ఉన్నప్పుడు అదిల్‌ వీడియో షూట్‌ చేశాడు. అలాంటి వీడియోలు అతని వద్ద చాలా ఉన్నాయి. నా శరీరం మొత్తం నగ్నంగా కనిపిస్తోంది. అప్పుడు నేను సైలెంట్‌గా ఉన్నాను. ఎందుకంటే అప్పుడు నేను అతని భార్యను. ఇంట్లో అతడు నాపై తరచూ అత్యాచారం చేసేవాడు. ప్రస్తుతం నా వీడియోలు వైరల్‌ అవుతున్నాయి. ఇప్పుడు నేను ఏం చేయాలి ? ప్రపంచం మొత్తం నా వీడియోలు చూసిన తర్వాత నేను ఎక్కడికి వెళ్లాలి ? నా ముఖం ఎలా చూపించాలి ? విషం తాగి సూసైడ్‌ చేసుకోవాలా ? నేను ఓ సాధారణ అమ్మాయిని కాదు. ఇండియాలో ఓ సెలబ్రిటీని. నాకు ఓ బ్రాండ్‌ ఉంది. ఏడాదిలోపే అతడు నాకు విడాకులు ఇచ్చాడు. ఇప్పుడు నేను ఏం చేయాలో మీరే చెప్పండి..?' అంటూ రాఖీ సావంత్‌ వాపోయింది.

Post a Comment

0Comments

Post a Comment (0)