న్యూస్‌క్లిక్‌పై చర్యలు తీసుకోండి ! - NEWS & POLITICAL : UPDATE NEWS

Breaking

Ad

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

adg

Friday, 11 August 2023

న్యూస్‌క్లిక్‌పై చర్యలు తీసుకోండి !


కొన్ని మీడియా సంస్థలు భారతదేశానికి వ్యతిరేకంగా పనిచేస్తున్నాయని అటువంటి సంస్థలపై చర్యలు తీసుకోవాలని ప్రముఖులు డిమాండ్ చేశారు. అటువంటి వాటిలో న్యూస్ క్లిక్ కూడా ఉందని, ఆ మీడియాసంస్థపై చర్యలు తీసుకోవాలని 255 మంది ప్రముఖులు డిమాండ్‌ చేశారు. సంస్థపై చర్యలు తీసుకోవాలని కోరుతూ వారు భారత రాష్ర్టపతి, భారత సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తికి లేఖలు రాశారు. చైనాతో సంబంధం ఉన్న సంస్థల నుంచి నిధులు అందుకుంటున్నాయనే ఆరోపణలు ఎదుర్కొంటున్న న్యూస్‌క్లిక్ మీడియా సంస్థ పై చర్యలు తీసుకోవాలని 255 మంది ప్రముఖులు రాష్ట్రపతి, సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తిని లేఖలో కోరారు. చైనాతో సంబంధం ఉన్న సంస్థల నుంచి న్యూస్‌క్లిక్ మీడియా సంస్థకు నిధులు అందుతున్నాయని ఆరోపణలు ఉన్నాయని వారు లేఖలో పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో న్యూస్‌క్లిక్ పై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతూ 255 మంది ప్రముఖులు రాష్ట్రపతి, సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తికి రాసిన బహిరంగ లేఖలో కోరారు. . దేశ వ్యతిరేక, ప్రజాస్వామ్య వ్యతిరేక చర్యలకు పాల్పడే వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు. తాము భారత వ్యతిరేకుల వల్ల తీవ్ర మనస్తాపానికి గురైన భారతీయులుగా ఈ లేఖ రాస్తున్నట్టు పేర్కొన్నారు. నకిలీ వార్తలు, తమ స్వార్థం కోసం న్యూస్‌క్లిక్‌ (న్యూస్ పోర్టల్) దేశ ప్రయోజనాలను తాకట్టు పెడుతుందని, ఈ విషయం న్యూ యార్క్ టైమ్స్ పరిశోధనలో బహిర్గతమైందని వారు లేఖలో వెల్లడించారు. నెవిల్లే రాయ్ సింఘం ద్వారా నిధులు అందుకుంటున్న సంస్థగా న్యూయార్క్ టైమ్స్ దర్యాప్తులో తేలిందని.. న్యూస్‌క్లిక్‌పై చర్య తీసుకోవాలని తాము కోరుతున్నట్టు లేఖలో పేర్కొన్నారు. దేశంలో ఉంటూ దేశానికి వ్యతిరేకంగా.. ప్రజాస్వామ్య వ్యతిరేక ఎజెండాతో పనిచేసే వారిని దేశం నుంచి బహిష్కరించాలని.. ఇటువంటి విషయాలను బహిర్గతం చేసేలా వస్తున్న కథనాలను నిరోధించాలని వారు లేఖలో కోరారు. 

No comments:

Post a Comment