జరూర్ అహ్మద్ భట్పై ప్రతీకారం తీర్చుకుంటున్నారా ?

Telugu Lo Computer
0


జమ్మూ కాశ్మీర్లో ఆర్టికల్ 370 రద్దును వ్యతిరేకిస్తూ సుప్రీంకోర్టులో కేసు దాఖలు చేసిన లెక్చరర్ జరూర్ అహ్మద్ భట్‌ను ఆయన పనిచేసే కాలేజీ యాజమాన్యం సస్పెండ్ చేసింది. ఈ అంశాన్ని వెంటనే పరిశీలించాల్సిందిగా అటార్నీ జనరల్‌ ఆర్‌ వెంకటరమణి, సొలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మెహతాలను కోరింది సుప్రీంకోర్టు. గత బుధవారం ఢిల్లీ వచ్చిన జరూర్ అహ్మద్ భట్ ప్రధాన న్యాయమూర్తి చంద్రచూడ్ నేతృత్వంలోని ఐదుగురి సభ్యులతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం ముందు హాజరయ్యారు. అనంతరం తిరిగి వెళ్లిన ఆయనకు వారు పనిచేసే కాలేజీ యాజమాన్యం సస్పెన్షన్ ఆర్డర్లు జారీ చేసినట్లు ఆయన తరపు న్యాయవాది కపిల్ సిబాల్ సుప్రీంకోర్టుకు తెలిపారు. వెంటనే స్పందిస్తూ సుప్రీం ధర్మాసనం అటార్నీ జనరల్ ఆర్.వెంకటరమణిని ఇక్కడ కోర్టు ముందు హాజరైన ఉద్యోగిని విధుల నుంచి తొలగించారని చెబుతున్నారు.. ఈ అంశాన్ని ఒకసారి పరిశిలించండి.. వీలయితే లెఫ్టినెంట్ గవర్నర్‌తో మాట్లాడండని సూచించింది. ఇది ప్రతీకార చర్య కాదు కదా..? అని సాలిసిటర్ జనరల్ తుషార్ మెహతాను ప్రశ్నించగా జస్టిస్ ఎస్‌కె కౌల్ దానిపై ఎలాంటి స్పష్టత లేదని న్యాయస్థానికి తెలిపారు. భట్ జమ్మూ కశ్మీర్ ఉద్యోగుల క్రమశిక్షణ నిబంధనలను ఉల్లంఘించారని, జమ్మూ కశ్మీర్ ఉద్యోగుల ప్రవర్తనా నియమావళిని, సెలవు నిబంధనలను అతిక్రమించినందుకు ఆయనపై ఈ చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపింది జమ్మూ కశ్మీర్ విద్యా శాఖ. ఈ సస్పెన్షన్ సమయంలో భట్ జమ్ము పాఠశాల విద్య డైరెక్టరేట్‌కు జవాబుదారీగా ఉంటారని తెలిపారు. గురువారం సుప్రీం ధర్మాసనం ముందు హాజరై తన వాదనలను వినిపించిన భట్ ఆర్టికల్ 370 రద్దు తర్వాత పొలిటికల్ సైన్స్ లెక్చరర్‌గా పనిచేస్తున్న తనకు మనం ఇంకా ప్రజాస్వామ్యంలోనే ఉన్నామా అని విద్యార్థులు అడిగితే సమాధానం చెప్పడం కష్టాంగా ఉందన్నారు. జమ్మూ కశ్మీర్ ప్రత్యేక హోదాను కోల్పోయి రెండు కేంద్ర పాలిట ప్రాంతాలుగా విభజించబడిందని ఇది పూర్తిగా భారత రాజ్యాంగానికి విరుద్ధమని కోర్టులో వాదించారు.ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, బహుజన్ సమాజ్ పార్టీ నాయకురాలు మాయావతి మీడియాపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కొన్ని కులతత్వ మీడియాలు ఉన్నాయంటూ వ్యాఖ్యానించిన ఆమె, దళితుల విషయంలో పద్దతి మార్చుకోవాలంటూ ఆమె తనదైన శైలిలో వార్నింగ్ ఇచ్చారు. ఎన్నికల సమయంలో మాయావతిని ఉద్దేశించి మీడియాలో ప్రధానంగా ఒకరమైన కథనాలు వస్తుంటాయి. ఆమె ఎవరి ఓట్లను చీల్చబోతున్నారు, ఎవరికి ఆమె లాభం చేకూర్చబోతున్నారు అంటూ కథనాలు వస్తుంటాయి. వచ్చే సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో తాజాగా అలాంటి కథనాలే మళ్లీ ప్రారంభం అయ్యాయి. దీన్ని పరోక్షంగా లేవనెత్తుతూనే మాయావతి ఈ వ్యాఖ్యలు చేశారు. సోమవారం ఆమె తన అధికారిక ఎక్స్(ట్విటర్) ఖాతా ద్వారా స్పందిస్తూ.. ''బడుగు, బలహీన వర్గాలకు రాజ్యాంగబద్ధమైన హక్కులు కల్పించి వారికి ఆత్మగౌరవం, ఆత్మగౌరవంతో కూడిన జీవితాన్ని అందించడానికి జీవితాన్ని అంకితం చేసిన బీఎస్పీ అధినేత పేరుతో ఆడుకోవడం అన్యాయం, బాధ్యతారాహిత్యం. కులతత్వంతో మీడియాలో ఒక వర్గం ఇలాంటి కార్యక్రమాలు చేస్తోంది. ఒకరిని గుడ్డిగా కాపీ కొట్టే బదులు, ఇలాంటి మీడియా సెక్షన్‌లు వారి స్వంత విచారణ/పరిచయం తర్వాత మాత్రమే వారి జీవిత పరిచయాన్ని రాయాలి. ఎందుకంటే పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు అందరూ ఆమెను మాయావతి అని కాకుండా చిన్నా పెద్ద వారు కూడా గౌరవంగా బెహెన్ జీ అని సంబోధిస్తారు. కాబట్టి చంద్రావతి అని, మరింకేదో అని తప్పుడు పేరు ప్రచారం చేయడం ఖండించదగినది. ఏదైనా నిర్దిష్ట వ్యక్తిత్వం గురించి ఏదైనా సమాచారం ఇచ్చే ముందు, వారు సరైన వాస్తవాలను పొందాలి. లేకపోతే తప్పుడు సమాచారం ఇవ్వడం ద్వారా ప్రజలు మీడియాపై నమ్మకం కోల్పోతారని మీడియాకు చెప్తున్నాను. ముఖ్యంగా దళిత సమాజం విషయంలో కులతత్వ మీడియా తన ఆలోచనను సరిదిద్దుకుంటే మంచిది'' అని మాయావతి వరుస ట్వీట్లు చేశారు.

Post a Comment

0Comments

Post a Comment (0)