సెప్టెంబర్ 19 నుంచి జియో ఎయిర్ ఫైబర్ సర్వీసులు !

Telugu Lo Computer
0


సెప్టెంబర్ 19 నుంచి ఎయిర్ ఫైబర్ సేవలు  అందుబాటులోకి తెస్తామని ముకేశ్ అంబానీ ప్రకటించారు. దీని వల్ల కస్టమర్లకు పలు ప్రయోజనాలు లభిస్తాయని చెప్పుకోవచ్చు. జియో ఎయిర్ ఫైబర్ ద్వారా ఫైబర్ మాదిరిగానే అదిరే స్పీడ్‌తో సర్వీసులు పొందొచ్చు. అయితే ఎలాంటి వైర్లు అవసరం ఉండదు. మీరు కేవలం ఈ డివైజ్‌ను ఆన్ చేస్తే సరిపోతుంది. దీని ద్వారా కస్టమర్లు పర్సనల్ వైఫై హాట్‌స్పాట్ క్రియేట్ చేసుకోవచ్చు. సూపర్ 5జీ స్పీడ్‌తో ఇంటర్నెట్ సర్వీసులు పొందొచ్చు. జియో ఎయిర్ ఫైబర్ ద్వరా క్షణాల్లో హైస్పీడ్ ఇంటర్నెట్‌తో కనెక్ట్ కావొచ్చు. ఆఫీస్ లేదా ఇంటిలో ఈ సర్వీసులు పొందొచ్చు. అలాగే ముకేశ్ అంబానీ మాట్లాడుతూ.. గత పదేళ్ల కాలంలో రిలయన్స్ ఇండస్ట్రీస్ కంపెనీ 150 బిలియన్ డాలర్లు ఇన్వెస్ట్ చేసిందని వెల్లడించారు. మరే కార్పొరేట్ కంపెనీ కూడా ఈ స్థాయిలో ఇన్వెస్ట్ చేయలేదని గుర్తు చేశారు. రిలయన్స్ ఇండస్ట్రీస్ కంపెనీ మరో ఏడాది కూడా అదిరిపోయే ఆల్‌రౌండర్ పనితీరును నమోదు చేసిందని అంబానీ తెలిపారు. రిలయన్స్ కన్సాలిడేటెడ్ ఆదాయం రూ. 9,74,864 కోట్లుగా నమోదు అయ్యిందని పేర్కొన్నారు. రిలయన్స్ ఈబీటా కూడా 1,53,920 కోట్లుగా ఉందని తెలిపారు. ఇక నికర లాభం రూ. 73,670 కోట్లుగా ఉందని వివరించారు. అన్ని వ్యాపారాల్లోనూ రిలయన్స్ కంపెనీ 2.6 లక్షల ఉద్యోగాలను క్రియేట్ చేసిందని పేర్కొన్నారు. 5జీ సర్వీసులను గత అక్టోబర్ నెలలో అందుబాటులోకి తెచ్చామని ఈయన గుర్తు చేశారు. 9 నెలల కాలంలోనే జియో 5జీ ఇప్పుడు 96 శాతం సెన్సస్ టౌన్స్‌లో అందుబాటులో ఉందని వెల్లడించారు. 2023 డిసెంబర్ కల్లా దేశ వ్యాప్తంగా జియో 5జీ సేవలు అందుబాటులోకి వస్తాయని వెల్లడించారు. ప్రపంచంలోనే జియో 5జీ అనేది ఫాస్టెస్ట్ ఎవర్ 5జీ రోల్ ఔట్ అని ఆయన తెలిపారు. కనెక్టివిటీ, డివైజెస్ సపోర్ట్, వాల్యూ యాడెడ్ సర్వీసులు ఇలా అన్ని రకాల 5జీ సేవలు అందిస్తున్న ఒకే ఒక 5జీ సంస్థ జియో 5జీ అని పేర్కొన్నారు. 4జీ సర్వీసులు తీసుకు వచ్చినప్పుడు విదేశీ సంస్థలతో భాగస్వామ్యం కుదుర్చుకున్నామని, కానీ 5జీ సేవలు 100 శాతం స్వదేశీ అని వివరించారు.

Post a Comment

0Comments

Post a Comment (0)