వర్షాకాలం - చేపల కూర !

Telugu Lo Computer
0


ర్షాలు, వరదల కారణంగా నీటి కాలుష్యం విపరీతంగా పెరిగిపోతుంది. వర్షపు నీరు, భూమి నుంచి నదులు, సరస్సుల ద్వారా సముద్రాలలోకి చేరుతాయి. తద్వారా కాలుష్యం కూడా సముద్రంలో ఎక్కువ అవుతుంది. చేపలు, ఇతర జలచరాలు ఈ కాలుష్య కారకాలను ఆహారంగా తీసుకుంటాయి. అవికాస్తా వాటి శరీరంలో పేరుకుపోతాయి. ఫలితంగా ఈ సీజన్‌లో చేపలు తినడం వలన చేపలు, సీఫుడ్స్‌లోని కాలుష్య కారకాలు మన శరీరంలోకి కూడా ప్రవేశిస్తాయి. దాంతో అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఎక్కువగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. మెర్క్యూరీ ఒక విషపూరితమైన హెవీ మెటల్. ఇది చేపలు, ఇతర సముద్రపు ఆహారంలో ఉంటుంది. ముఖ్యంగా ట్యూనా, స్వోర్డ్ ఫిష్, షార్క్ వంటి చేపల కణజాలాలలో పేరుకుపోతుంది. రుతుపవనాల కారణంగా పాదరసం స్థాయిలు హెచ్చుతగ్గులకు గురవతాయి. చేపల రకం, పరిమాణం అంశంలో జాగ్రత్తగా ఉండటం అవసరం. కలుషితమైన చేపలు తినడం వలన కాలక్రమేణా మన శరీరంలో పాదరసం ప్రమాదకరమైన స్థాయికి చేరుతుంది.. దానివల్ల ఎన్నో ప్రమాదాలు ఉన్నాయని చెబుతున్నారు. వర్షాకాలం నీటి వనరులలో పరాన్నజీవుల అభివృద్ధికి అనుకూలమైన వాతావరణాన్ని కల్పిస్తుంది. చేపలు, సముద్రపు ఆహారంలో టేప్‌వార్మ్‌లు, రౌండ్‌వార్మ్‌లు, ఫ్లూక్స్ వంటి పరాన్నజీవులు ఉండవచ్చు. ఇవి మనం తిన్నప్పుడు ఇన్‌ఫెక్షన్లకు కారణమవుతాయి. ఈ అంటువ్యాధులు జీర్ణవ్యవస్థపై ప్రభావం చూపుతాయి. కలుషితమైన సీఫుడ్స్ తినడం వలన అతిసారం, ఉబ్బరం, గ్యాస్ ఏర్పడుతుంది.. అందుకే దూరంగా ఉండాలి. కొందరికి చేపలు, ఇతర సీఫుడ్స్ వలన అలెర్జీ ఏర్పడే అవకాశం ఉంది. వర్షాకాలంలో ఈ అలెర్జీలు మరింత తీవ్రమవుతాయి. రోగనిరోధక వ్యవస్థపై దుష్ప్రభావం చూపుతుంది. సీఫుడ్స్ అలెర్జీ సమస్యలు తేలికపాటి నుండి తీవ్రమైనవి కూడా ఉండే అవకాశం ఉంది. దద్దుర్లు, దురద వంటి సమస్యలు వస్తాయి. దద్దుర్లు, ముఖం, పెదవులు, నాలుక, గొంతు వాపు, గురక, శ్వాస సంబంధిత వ్యాదులు వస్తాయి..ఇన్ని సమస్యలు వస్తాయని నిపుణులు అంటున్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)