వాహనాలపై కులం పేర్లు కనిపించొద్దు ! - NEWS & POLITICAL : UPDATE NEWS

Breaking

Ad

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

adg

Friday, 18 August 2023

వాహనాలపై కులం పేర్లు కనిపించొద్దు !


త్తర ప్రదేశ్ లో శాంతి భద్రతలపై జరిగిన సమీక్షలో వారణాసిలో ట్రాఫిక్ నిర్వహణ, వాహనాలపై అధికారులకు పలు సూచనలు చేసిన ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యనాథ్ వాహనాలపై కులాల పేర్లు కనిపించడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వీటిని వెంటనే అడ్డుకోవాలని వారికి ఆదేశాలు ఇచ్చారు. దీంతో అధికారులు ఇప్పుడు వాహనాలపై కులాల పేర్లు తొలగించేందుకు చర్యలు ప్రారంభించారు. యూపీలో ప్రజలు తమ వాహనాలపై తమ కులాన్ని ప్రదర్శించడాన్ని ఆపాలని ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ అధికారులను ఆదేశించారు. రెండు రోజుల పర్యటన నిమిత్తం వారణాసి చేరుకున్న ఆదిత్యనాథ్‌ ఇలాంటి విధానాన్ని నిషేధించాల్సిన అవసరం ఉందని శాంతి భద్రతల సమీక్షా సమావేశంలో అధికారులకు సూచించారు.వాహనాల రిజిస్ట్రేషన్ నంబర్ ప్లేట్లు, విండ్‌షీల్డ్‌లపై ప్రజలు తమ కులాలను ప్రదర్శించడం తరచుగా కనిపిస్తోందన్నారు. కొన్నిసార్లు వారు తమ కులాన్ని ప్రదర్శించడానికి వారి వాహనాల ముందు భాగంలో అదనపు డిస్‌ప్లే బోర్డులను ఉంచారని అధికారులకు యోగీ ఆదిత్యనాథ్ తెలిపారు. ఇలాంటి చర్యలకు స్వస్తి పలకాలని ముఖ్యమంత్రి ఆదేశించారని సమీక్ష అనంతరం ఓ అధికారి వెల్లడించారు. శాంతిభద్రతల సమీక్ష సందర్భంగా హోంగార్డులు, పీఆర్‌డీ సిబ్బందికి శిక్షణ ఇచ్చి ట్రాఫిక్‌ మేనేజ్‌మెంట్‌ వ్యవస్థలో నియమించాలని ముఖ్యమంత్రి యోగీ ఆదేశించారు. చైన్ స్నాచింగ్‌ల ఘటనలను ప్రస్తావిస్తూ, అలాంటి సంఘటనలు కూడా పెద్ద సమస్యలుగా మారే అవకాశం ఉన్నందున ప్రతీ చిన్న సంఘటనను గుర్తించాలని సీఎం యోగీ ఆదిత్యనాథ్ పోలీసు అధికారుల్ని ఆదేశించారు. పోలీసులు తమను నియమించిన జోన్లలో రెగ్యులర్ గా ఫుట్ పెట్రోలింగ్ నిర్వహించాలని ఆదేశించారు. ముఖ్యంగా రింగురోడ్డు వెంబడి వారణాసి నగర విస్తరణ, బస్టాండ్‌లు, ట్రాన్స్‌పోర్ట్‌ నగర్‌ ఏర్పాటుపై దృష్టి సారించిన సీఎం పటిష్టమైన డ్రైవ్‌తో నిర్ణీత గడువులోగా నిర్మాణ పనులు పూర్తి చేయాలని అధికారులకు సూచించారు.

No comments:

Post a Comment