స్థిరంగా ఉన్న బంగారం ధరలు

Telugu Lo Computer
0


బులియన్ మార్కెట్‌లో శనివారం  22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 54,950 ఉండగా, 24 క్యారెట్ల (999 Gold) 10 గ్రాముల బంగారం ధర రూ. 59,950గా ఉంది. నిన్నటితో పోల్చుకుంటే 22 క్యారెట్ల బంగారం ధరపై.. 24 క్యారెట్ల బంగారం ధరపై ఏ మార్పు లేదు. ఈ పసిడి ధరలు దేశీయ మార్కెట్లో ఈరోజు ఉదయం 6 గంటలకు నమోదైనవి.  ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 55,100 ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ. 60,100గా ఉంది. చెన్నైలో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 55,350లు ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ. 60,380 వద్ద కొనసాగుతోంది. ముంబై, బెంగళూరు, హైదరాబాద్‌, విజయవాడ, విశాఖపట్నంలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ. 54,950 ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ. 59,950గా కొనసాగుతోంది. మరోవైపు వెండి ధరలు వరుసగా మూడోరోజు తగ్గాయి. దేశీయ మార్కెట్‌లో కిలో వెండి ధర నేడు రూ. 74,800లుగా ఉంది. నిన్నటితో పోల్చుకుంటే కిలో వెండి ధరపై రూ. 200 తగ్గింది. ఈ మూడు రోజుల్లో కిలో వెండి ధర రూ. 3200 తగ్గింది. ముంబైలో కిలో వెండి ధర రూ. 74,800గా ఉండగా.. చెన్నైలో రూ. 78,200గా ఉంది. బెంగళూరులో కిలో వెండి ధర రూ. 74,000 ఉండగా.. హైదరాబాద్‌లో రూ. 78,200లుగా నమోదైంది. విజయవాడ, విశాఖపట్నంలో కిలో వెండి ధర రూ. 78,200ల వద్ద కొనసాగుతోంది.

Post a Comment

0Comments

Post a Comment (0)