దిగుమతుల నిషేధం నాలుగు నెలల పాటు వాయిదా !

Telugu Lo Computer
0


విదేశాల నుంచి లాప్‌టాప్‌లు, టాబ్లెట్లు, ఆల్ట్రా-స్మాల్ కంప్యూటర్లు, సర్వర్ల దిగుమతిపై విధించిన నిషేధంపై కేంద్ర ప్రభుత్వం శుక్రవారం వివరణ ఇచ్చింది. తక్షణం నిషేధం అమలు చేయబోవడం లేదని కేంద్ర మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ ట్వీట్ చేశారు. ఇప్పటికే కొన్ని ఆర్డర్లు చేసినందున టెక్ కంపెనీలకు నాలుగు నెలల పాటు పరివర్తన కాలం ఇస్తున్నట్లు తెలిపారు. లాప్‌టాప్‌లు, టాబ్లెట్లు, పర్సనల్ కంప్యూటర్ల దిగుమతి నిషేధంపై అమలు చేయడానికి ట్రాన్సిషన్ పీరియడ్ విషయమై త్వరలో డైరెక్టరేట్‌ జనరల్‌ ఆఫ్‌ ఫారిన్‌ ట్రేడ్‌ నోటిఫికేషన్ జారీ చేస్తుందని కేంద్ర మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ తెలిపారు. సెక్యూరిటీతోపాటు మేడ్ ఇన్ ఇండియా పాలసీ కింద దేశీయంగా వాటి తయారీని ప్రోత్సహించడానికి వాటి దిగుమతిపై నిషేధం విధిస్తున్నట్లు గురువారం కేంద్రం ప్రకటించిన సంగతి తెలిసిందే. ల్యాప్‌టాప్‌లు, టాబ్లెట్లు, పర్సనల్ కంప్యూటర్ల దిగుమతికి లైసెన్సుల కోసం దరఖాస్తు గడువు కూడా మరింత పెంచే అవకాశం ఉందని సమాచారం. దీనివల్ల టెక్ కంపెనీలకు రిలీఫ్ లభిస్తుందని తెలుస్తున్నది. దక్షిణ కొరియా, చైనా నుంచి ఎలక్ట్రానిక్స్, గ్యాడ్జెట్ల దిగుమతిని అడ్డుకోవడమే కేంద్ర ప్రభుత్వ వ్యూహంగా కనిపిస్తున్నది.

Post a Comment

0Comments

Post a Comment (0)