కేంద్రమంత్రి నారాయణ రాణె సభలో వ్యవహరించిన తీరు వివాదాస్పదం !

Telugu Lo Computer
0


విశ్వాస తీర్మానంపై చర్చలో భాగంగా లోక్‌సభలో కేంద్రమంత్రి నారాయణ రాణె వ్యవహరించిన తీరు వివాదాస్పదమైంది. శివసేన (యూబీటీ) ఎంపీ అరవింద్‌ సావంత్‌ ను ఉద్దేశించి మాట్లాడుతూ సహనం కోల్పోయారు. దీంతో ఆయన ప్రవర్తనను విపక్ష పార్టీలు తప్పుపట్టాయి. ప్రధానిమంత్రిపై వ్యాఖ్యలు చేసే స్థాయి సావంత్‌కు లేదంటూ దిగువ సభలో నారయణ రాణె ఆగ్రహం వ్యక్తం చేశారు. 'సావంత్‌.. మీరు కూర్చోండి. ప్రధాన మంత్రి మోడీ, కేంద్రమంత్రి అమిత్‌ షాపై వ్యాఖ్యలు చేసే స్థాయి మీకు లేదు. ఒకవేళ మీరు మాట్లాడితే దాని పరిణామాలు ఎదుర్కొంటారు' అని హెచ్చరికలు చేశారు. దాంతో లోక్‌సభ స్పీకర్‌ ఆయన్ను మందలించాల్సి వచ్చింది. సరైన పదజాలం వాడండి అంటూ సూచించారు. రాణె ప్రవర్తనపై విపక్షాల నుంచి విమర్శలు వ్యక్తం అయ్యాయి. 'ఒక రౌడీలా ఆయన పార్లమెంట్‌లో బెదిరింపులకు దిగారు. మోడీ  ప్రభుత్వాన్ని ప్రశ్నించే విపక్ష సభ్యులను వెంటనే సభ నుంచి సస్పెండ్ చేస్తారు. ఇలాంటి అనుచిత భాష ఉపయోగించిన భాజపా మంత్రిని సస్పెండ్ చేస్తారా..?' అని ఆమ్‌ ఆద్మీపార్టీ ప్రశ్నించింది. మంత్రి తన మాటలతో ఈ ప్రభుత్వ ప్రమాణాలను చూపిస్తున్నారంటూ శివసేన (యూబీటీ) ఎంపీ ప్రియాంకా చతుర్వేది మండిపడ్డారు.

Post a Comment

0Comments

Post a Comment (0)