యూనిఫామ్‌తో స్కూలుకి వెళ్తున్న 78 ఏళ్ల వృద్ధుడు !

Telugu Lo Computer
0


మిజోరాంలోని చంపాయ్ జిల్లా హ్రువైకాన్ గ్రామంలో లాల్రింగ్‌థరా ఉంటాడు. చదువుకి వయస్సు అడ్డంకి కాదని నిరూపించాడు. రాష్ట్రీయ మాధ్యమిక శిక్షా అభియాన్ ఉన్నత పాఠశాలలో 9 వ తరగతిలో చేరాడు. చదుకోవాలనే తన చిరకాల వాంఛను నెరవేర్చుకోవడానికి అతను యూనిఫాం ధరించి, పుస్తకాల బ్యాగుతో రోజుకి మూడు కిలోమీటర్లు ప్రయాణం చేసి వెళ్తున్నాడు. టెలివిజన్‌లో వచ్చే వార్తలను అర్ధం చేసుకోవడానికి, అప్లికేషన్ రాయడానికి లాల్రింగ్‌థరా చదువుకోవాలని నిర్ణయించుకున్నాడట. ఇండో-మయన్మార్ సరిహద్దు సమీపంలోని ఖువాంగ్ లెంగ్ గ్రామంలో 1945 లో జన్మించిన లాల్రింగ్‌థరా జీవితంలో ఎన్నో సవాళ్లను ఎదుర్కున్నాడట. తన తండ్రి అకాల మరణంతో 2 వ తరగతి తర్వాత స్కూలుకి వెళ్లలేకపోయాడట. తల్లికి సాయంగా ఝమ్ పొలాల్లో సాయం చేస్తూ కుటుంబాన్ని పోషించడం మొదలుపెట్టాడట. ఇప్పటికి తను విద్యను పూర్తి చేయాలనే కల స్కూల్లో చేరేలా ప్రేరేపించిందట. చదువుపట్ల అతనికి ఉన్న అంకిత భావాన్ని, సంకల్పాన్ని అందరూ అభినందిస్తున్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)