దుబాయి వీక్లీ డ్రాలో రూ.45కోట్ల జాక్‌పాట్ కొట్టిన ముంబై వాసి ! - NEWS & POLITICAL : UPDATE NEWS

Breaking

Ad

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

adg

Thursday, 3 August 2023

దుబాయి వీక్లీ డ్రాలో రూ.45కోట్ల జాక్‌పాట్ కొట్టిన ముంబై వాసి !


ముంబైకి చెందిన సచిన్ పాతికేళ్ల నుంచి దుబాయిలో ఉంటున్నాడు. అక్కడ ఓ ప్రైవేట్ కంపెనీలో సీఏడీ టెక్నీషియన్‌ గా పని చేస్తున్నాడు. గత రెండేళ్ల నుంచి మహ్జూజ్ డ్రాలో పాల్గొంటున్నాడు. ఇప్పటివరకు అతడు దీనికోసం 25వేల దిర్హమ్స్ ఖర్చు చేశాడు. ఈ క్రమంలో జూలై 29న నిర్వహించిన వీక్లీ డ్రాలో సచిన్‌ కు అదృష్టం వరించింది. ఈ డ్రాలో విజేతగా నిలిచిన అతడు రూ. 45కోట్లు (20 మిలియన్ దిర్హమ్స్) గెలుచుకున్నాడు. ఈ సందర్భంగా సచిన్ మాట్లాడుతూ  "ఈ విజయం నాకు నిజంగా షాక్ ఇచ్చింది. ఈ వార్త నా దినచర్యను మార్చేసింది. మహ్జూజ్ అధికారుల నుండి నాకు కాల్ వచ్చినప్పటి నుండి నేను సరిగ్గా నిద్రపోలేకపోతున్నానంటే నమ్మండి" అని చెప్పుకొచ్చాడు. ఇక తాను గెలిచిన ఈ భారీ ప్రైజ్‌మనీని పిల్లల చదువులకు, మంచి లాభాలు వచ్చే వ్యాపారాలలో పెట్టుబడిగా పెడతానని సచిన్ అన్నాడు. 

No comments:

Post a Comment