రామరాజ్యం అంటే ఇదేనా ?

Telugu Lo Computer
0


బీజేపీపై మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, శివసేన (యూబీటీ) చీఫ్ ఉద్ధవ్ ఠాక్రే తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. హర్యానా, మణిపూర్ లో చోటు చేసుకున్న ఘర్షణలపై కేంద్రానికి సూటి ప్రశ్నలు సంధించారు. డబుల్ ఇంజిన్ సర్కారుతో మాత్రమే అభివృద్ధి సాధ్యమన్న బీజేపీ నేతలు హర్యానాలో అల్లర్లు జరుగుతుంటే ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. ఈశాన్య రాష్ట్రం మణిపూర్ లో మూడు నెలలుగా జరుగుతున్న హింసను ఎందుకు ఆపలేకపోతున్నారని మండిపడ్డారు. 'మణిపూర్, హర్యానాల్లో ఉన్నది బీజేపీ ప్రభుత్వాలే. కేంద్రంలోనూ ఆ పార్టీ కూటమే అధికారంలో ఉంది. రెండు రాష్ట్రాల్లో అల్లర్లు జరుగుతుంటే డబుల్ ఇంజిన్ సర్కార్ ఏం చేస్తోంది..? మణిపూర్ పరిస్థితి గురించి నేను పదేపదే అడిగాను. మణిపూర్ లో ఉన్న గవర్నర్ ఓ మహిళ. అక్కడ మహిళలపై అఘాయిత్యాలు జరుగుతుంటే రాష్ట్ర ప్రభుత్వం ఏం చేయలేకపోతోంది. డబుల్ ఇంజిన్ ఎక్కడుంది..? కనీసం హహిళలను రక్షించే ప్రయత్నం కూడా చేయని నేతలు హిందూత్వ గురించి మాట్లాడుతున్నారు. ఇలాంటి నేతల నుంచి ప్రజా సంక్షేమం ఏం ఆశిస్తాం. రామరాజ్యం అంటే ఇదేనా..?' అని ఉద్ధవ్ ఠాక్రే ప్రశ్నించారు.

Post a Comment

0Comments

Post a Comment (0)