సెంథిల్ బాలాజీకి 25 వరకు జ్యుడీషియల్ కస్టడీ

Telugu Lo Computer
0


నీలాండరింగ్ కేసులో అరెస్టయిన తమిళనాడు మంత్రి సెంథిల్ బాలాజీపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ ) శనివారం ఛార్జిషీట్ దాఖలు చేసింది. కోర్టు ముందు ఆయనను శనివారం హాజరు పర్చగా ప్రిన్సిపల్ సెషన్స్ జడ్జి ఎన్ అల్లి ఈనెల 25 వరకు జ్యుడీషియల్ కస్టడీ విధించారు. గత జూన్ 14న మంత్రి బాలాజీని ఈడీ అరెస్టు చేయగా, అప్పటి నుంచి చెన్నై లోని పుఝాల్ సెంట్రల్ జైలు లోనే ఆయన ఉంటున్నారు. ఈడీ 170 పేజీల ప్రాసిక్యూషన్ ఫిర్యాదును కోర్టుకు సమర్పించింది. ఈ కేసులో దర్యాప్తు చేయడానికి వీలుగా ఐదురోజుల పాటు కస్టడీ లోకి తీసుకోడానికి వీలుగా మంత్రి బాలాజీ అరెస్టుకు జడ్జి అల్లి ఈడీకి ఈ నెల 7న అనుమతించారు.

Post a Comment

0Comments

Post a Comment (0)