20 మంది సిట్టింగ్‍లకు కేసీఆర్ షాక్ ? - NEWS & POLITICAL : UPDATE NEWS

Breaking

Ad

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

adg

Friday, 18 August 2023

20 మంది సిట్టింగ్‍లకు కేసీఆర్ షాక్ ?


తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల దగ్గర పడుతుండడంతో ప్రధాన పార్టీలు అభ్యర్థుల ఎంపికపై దృష్టి సారించాయి. బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థుల ఎంపికలో బిజీగా ఉన్నాయి. అయితే అభ్యర్థుల ఎంపికలో బీఆర్ఎస్ దూకుడుగా వ్యవహరిస్తోంది. సీఎం కేసీఆర్ ఇప్పటికే 80 నుంచి 90 జాబితా సిద్ధం చేశారని ప్రచారం జరుగుతోంది. అయితే కేసీఆర్ 20 మంది సిట్టింగ్ లకు షాక్ ఇవ్వబోతున్నట్లు పార్టీ శ్రేణుల్లో చర్చ జరుగుతోంది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఆదిలాబాద్ ఎమ్మెల్యే రేఖా నాయక్, బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్యకు టికెట్ రాకపొవచ్చని చర్చ జరుగుతోంది. ఇక ఉమ్మడి కరీంనగర్ జిల్లా విషయానికొస్తే చొప్పదండి ఎమ్మెల్యే సుంకే రవి శంకర్, వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్, రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్, జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ క టికెట్ నిరాకరించవచ్చని ప్రచారం జరుగుతోంది. ఉమ్మడి మెదక్ జిల్లాలో నర్సాపూర్ ఎమ్మెల్యే మదన్ రెడ్డి, జహీరాబాద్ ఎమ్మెల్యే మాణిక్ రావు, ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాశ్ రెడ్డికి టికెట్ రాకపోవచ్చని చర్చించుకుంటున్నారు. హైదరాబాద్ కు సంబంధించి అంబర్ పేట ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్, ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్, ఉమ్మడి మహబుబ్ నగర్ జిల్లా పాలకుర్తి జైపాల్ యాదవ్ కూడా టికెట్ర రాకపోవచ్చని ప్రచారం జరుగుతోంది. ఉమ్మడి నల్గొండ జిల్లాలో నాగార్జునసాగర్ ఎమ్మెల్యే నోముల భగత్, కోదాడ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్, మునుగోడు ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డికి కూడా టిటెక్ రావడం డౌట్ గానే ఉన్నట్లు చర్చ జరుగుతోంది. ఉమ్మడి వరంగల్ జిల్లా స్టేషన్ ఘన్ పూర్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య, జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి, వరంగల్ తూర్పు ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్, ఉమ్మడి ఖమ్మం జిల్లా వైరా ఎమ్మెల్యే రాములు నాయక్, ఇల్లందు ఎమ్మెల్యే హరిప్రియ నాయక్ టికెట్ రాకపొవచ్చని ప్రచారం జరుగుతోంది.

No comments:

Post a Comment