ఆంధ్రప్రదేశ్ లో రాగల రెండు రోజుల్లో వర్షాలు !

Telugu Lo Computer
0


వాయువ్య బంగాళాఖాతం పరిసర ప్రాంతాల్లో అల్పపీడనం ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ లోని శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, విజయనగరం, అల్లూరి సీతారామరాజు, పల్నాడు జిల్లాల్లో మోస్తరు నుంచి తేలికపాటి వర్షాలు కురుస్తాయని, మిగిలిన జిల్లాల్లో చెదురు మదురు చినుకులు రాలతాయని తెలిపింది. ప్రజలు, రైతులు ఈ వానలపట్ల అత్యంత అప్రమత్తంగా ఉండాలని విపత్తుల నిర్వహణ సంస్థ సూచిస్తోంది. అల్పపీడన ప్రభావంతో ఈనెల 18వ తేదీ నుంచి 21వ తేదీ వరకు వర్షాలు కురుస్తాయని, తీరం వెంబడి గంటకు 40 నుంచి 55 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని వాతావరణ శాఖ పేర్కొంది. మత్స్యకారులు శుక్రవారం నుంచి వేటకు వెళ్లవద్దని, సముద్రం అల్లకల్లోలంగా ఉంటుందని, తూర్పుగోదావరి, కాకినాడ, పార్వతీపురం మన్యం, శ్రీకాకుళం, విశాఖపట్నం, విజయనగరం జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని, మిగిలిన జిల్లాల్లో తేలికపాటి వానలకు అవకాశం ఉందని తెలిపింది. మరోవైపు తెలంగాణ వ్యాప్తంగా కొన్ని జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి. అల్పపీడనం ప్రభావంతో రాగల మూడు రోజుల పాటు తెలంగాణలో పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ శాఖ అంచనా వేసింది. పశ్చిమ, వాయువ్య దిశల నుంచి తెలంగాణ వైపు గాలులు వీస్తుండగా.. మూడు రోజులపాటు వర్షాలు కురవొచ్చని చెబుతున్నారు. ఈరోజు, రేపు అకడక్కడా కొన్ని జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. మూడు రోజులు ఉరుములు, మెరుపులతో వర్షాలు కురుస్తాయని తెలిపింది.

Post a Comment

0Comments

Post a Comment (0)