క్రిమియాపైకి దూసుకొచ్చిన 20 డ్రోన్లు !

Telugu Lo Computer
0


నిన్న మొన్నటివరకు మాస్కోపై దాడులు చేసిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. ఇప్పుడు రష్యా ఆక్రమిత క్రిమియా ద్వీపంపై గురిపెట్టాయి. శనివారం 20 డ్రోన్లు క్రిమియాపై దాడికి వచ్చాయి. ఈ ద్వీపాన్ని 2014లో ఉక్రెయిన్‌ నుంచి రష్యా ఆక్రమించిన సంగతి తెలిసిందే. వెల్లువలా వచ్చిన 20 డ్రోన్లలో పద్నాలుగింటిని తమ గగనతల రక్షణ వ్యవస్థ కూల్చివేసిందని, మిగతా ఆరింటిని ఎలక్ట్రానిక్‌ పద్ధతిలో స్తంభింపచేశామని రష్యా సైన్యం పేర్కొంది. కీలక అంశం ఏమిటంటే రష్యా ప్రధాన భూభాగాన్ని, క్రిమియాను కలిపే 19 మైళ్ల కెర్చ్‌ వంతెనపై రెండు క్షిపణులను ఉక్రెయిన్‌ ప్రయోగించింది. ఈ రెండింటిని కూడా కూల్చామని మాస్కో తెలిపింది. ఇప్పటికే 2 సార్లు దాడులు చేసి ఈ కీలక వంతెనకు ఉక్రెయిన్‌ తీవ్ర నష్టం కలిగించింది. మరోవైపు కలినిన్‌గ్రాడ్‌ ప్రాంతంలో రష్యా సైనిక శిక్షణ యుద్ధ విమానం (ఎస్‌యూ-30) కూలి ఇద్దరు పైలట్లు మృతి చెందారు.

Post a Comment

0Comments

Post a Comment (0)