ఇడ్లీ రూపాయి, దోశ ఐదు రూపాయలు ! - NEWS & POLITICAL : UPDATE NEWS

Breaking

Ad

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

adg

Sunday, 13 August 2023

ఇడ్లీ రూపాయి, దోశ ఐదు రూపాయలు !


ర్ణాటకలోని తుమకూరు జిల్లా చిక్కనాయకనహళ్లి తాలుకా హులియారులోని బనశంకరమ్మ అనే దేవాలయం ఆలయం వద్ద ఉన్న శిథిలావస్థలో ఓ హోటల్ ఉంది. ఆ హోటల్‌నే కాంతమ్మ నడిపిస్తోంది. అయితే ఆ హోటల్లోని ఇడ్లీలోకి వేరుశనగ పొడి, పల్లీలతో తయారుచేసిన చట్ని ఉంటుంది. గతంలో కేవలం రెండు రూపాయలకే కాంతమ్మ మూడు ఇడ్లీలు ఇచ్చేది. కానీ ఈ మధ్య నిత్యావసర ధరలు పెరగడంతో ఒక రూపాయికే ఒక ఇడ్లీని అందజేస్తోంది. ఇక్కడ మరో విషయం ఏంటంటే హోటల్ వద్దకు రాలేనివారు ఫోన్ చేస్తే చాలు. పార్శిల్ పంపుతుంది. అలాగే ఇందుకు ఎక్స్‌ట్రా ఛార్జీలు కూడా ఏమి ఉండవు. అలాగే అరిసికెరె తాలుకా కురవంక గ్రామానికి చెందినటువంటి కాంతమ్మకు హులియారుకి చెందిన తమ్మయ్య అనే వ్యక్తితో 24 ఏళ్ల క్రితం పెళ్లి జరిగింది. అయితే ఆమె భర్త మద్యానికి బానిస కావడంతో సంసారాన్ని ఆమె తన చేతుల్లోకి తీసుకెళ్లింది. ఇక కుటుంబ పోషణ కోసం ఇడ్లీల వ్యాపారం మొదలుపెట్టింది. ఇంటివద్దనే ఇడ్లీలు తయారు చేసుకొని పాత్రలో పెట్టుకుని ఇంటింటికీ వెళ్లి విక్రయించేది. అయితే ఇప్పుడు వయస్సు మీద పడటం వల్ల ప్రస్తుతం ఇంటి దగ్గరే ఇడ్లీలు తయారు చేసి అమ్ముతుంది. అలాగే కాంతమ్మ ఇడ్లీలతో పాటు దోసెలు కూడా విక్రయిస్తోంది. 5 రూపాయలకే దోసెలు ఇస్తోంది. అయితే ఇవి రుచిగా ఉండటంతో చాలామంది గంటల తరబడి వేచి ఉంటారు. ఎలాగైనా ఆమె చేసే దోసెలు, ఇడ్లీలు తిని వెళ్తుంటారు. గతంలో కాంతమ్మ కట్టెల పొయ్యిపై ఇడ్లీలు తయారుచేసేది. అయితే ఇప్పుడు గ్యాస్‌స్టౌపై తయారు చేస్తోంది. మరో విషయం ఏంటంటే కాంతమ్మ ఇడ్లీలు అమ్మి పెద్దగా సంపాదించింది కూడా ఏమి లేదు. ప్రతిరోజూ 300 నుంచి 400 వరకు ఇడ్లీలు తయారుచేస్తుంది. అయితే ఆమెను ఇలా ఒక్కరూపాయికే ఇడ్లీలు ఎందుకు అమ్ముతున్నావని అడగగా తాను లాభం కోసం ఈ పని చేయడం లేదని .. పేదల ఆకలి తీర్చడమే తన లక్ష్యమని కాంతమ్మ చెబుతోంది.

No comments:

Post a Comment