స్వామి ప్రసాద్ మౌర్య నాలుక కోస్తే రూ. 10 లక్షల రివార్డు - NEWS & POLITICAL : UPDATE NEWS

Breaking

Ad

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

adg

Wednesday, 30 August 2023

స్వామి ప్రసాద్ మౌర్య నాలుక కోస్తే రూ. 10 లక్షల రివార్డు


హిందుత్వం ఓ బూటకమని వ్యాఖ్యానించిన సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ) నేత స్వామి ప్రసాద్ మౌర్యపై యూపీ కాంగ్రెస్ నేత సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎస్పీ నేత స్వామి ప్రసాద్ మౌర్య నాలుక కోసిన వారికి రూ. 10 లక్షల నగదు అందచేస్తానని కాంగ్రెస్ పార్టీ మానవ హక్కుల విభాగం చీఫ్ పండిట్ గంగారాం శర్మ పేర్కొన్నారు. మౌర్య హిందూ మతాన్ని కించపరచడంతో పాటు రామచరిత్‌మానస్‌ను అవమానించారని మండిపడ్డారు. మౌర్య నాలుక కోసిన వారికి రూ. 10 లక్షల నగదు రివార్డును ప్రకటిస్తూ శర్మ రాసిన లేఖ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కాగా హిందూయిజం బూటకమని, మోసపూరితమని మౌర్య గత వారం ట్విట్టర్ వేదికగా వ్యాఖ్యానించారు. సమాజంలో అన్ని అసమానతలకు బ్రాహ్మణిజం కారణమని కూడా మౌర్య పేర్కన్నారు. సమాజంపై బ్రాహ్మణవాదం చాలా లోతుగా వేళ్లూనుకుందని, అసలు హిందూ మతమే లేదని, ఇదంతా బూటకమని అన్నారు. సమాజంలో దళితులు, గిరిజనులు, వెనుకబడిన కులాల ప్రజలను అణగదొక్కేందుకు బ్రాహ్మణ మతాన్నే హిందూ మతంగా రుద్దారని వ్యాఖ్యానించారు. హిందూ మతమే ఉంటే దళితులు, బీసీలు, గిరిజనులకు గౌరవం దక్కేదని కానీ అలా జరగడం లేదని మౌర్య పేర్కొన్నారు.

No comments:

Post a Comment