ప్రేమ జంట బైక్ పై రొమాన్స్ !

Telugu Lo Computer
0


ఢిల్లీలోని మంగోల్‌పురిలోని ఔటర్ రింగ్ రోడ్ ఫ్లైఓవర్‌పై ఓ ప్రేమ జంట పబ్లిక్ గా రొమాన్స్ చేసింది. బైక్ ట్యాంక్‌పై కూర్చున్న అమ్మాయి  రైడింగ్ చేస్తున్న అబ్బాయిని గాఢంగా కౌగిలించుకుంది. బైకు నిదానంగా వెళుతుందా అదీ లేదు. ప్రియుడు అమిత వేగంతో దూసుకెళ్లాడు. ఆ జోష్లో యువతి యువకుడిని గట్టిగా హగ్ చేసుకుని ముద్దుల వర్షం కురిపించింది. వీరి వ్యవహారాన్ని కారులో వెళుతున్న ఓ వ్యక్తి వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేశారు. దీంతో వైరల్ అయింది. ఈ ఘటనపై ఢిల్లీ ట్రాఫిక్ పోలీసులు స్పందించారు. ట్రాఫిక్ ఉల్లంఘనలకు పాల్పడిన వారి సమాచారాన్ని ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలిపారు. ఇలాంటి ఘటనలపై ఢిల్లీ ట్రాఫిక్ పోలీసు సెంటినల్ యాప్‌కు రిపోర్ట్ చేయాలని సూచించారు. అటు ఈ వీడియోపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. మరో యూజర్ అమ్మాయి హెల్మెట్ పెట్టుకోలేదని, వారిని అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. https://t.me/offerbazaramzon

Post a Comment

0Comments

Post a Comment (0)