జాజికాయ - ఆరోగ్య ప్రయోజనాలు !

Telugu Lo Computer
0


జాజికాయను పలు ఆయుర్వేద ఔషధాల్లో వాడతారు. దీనితో పలు సమస్యలకు చెక్ పెట్టవచ్చు. సెక్స్ సమస్యలతో బాధపడే వారికి జాజికాయ భలే పని చేస్తుంది. సెక్స్ సామర్థ్యాన్ని పెంచడమే కాకుండా వీర్యం వృద్ధికి కూడా తోడ్పడుతుంది. రోజూ అర స్పూన్ జాజికాయ పొడిని పాలలో కలుపుకుని తాగితే సెక్స్ సామర్థ్యం పెరుగుతుంది. స్త్రీలకు రుతుక్రమ సమయంలో ఏర్పడే నొప్పులను తగ్గిస్తుంది. పొడిని సూప్ లలో వేసి తీసుకుంటే విరేచనాలు, మలబద్దకం, గ్యాస్ తదితర జీర్ణ సమస్యలు తగ్గుతాయి. అలాగే శరీరంలో ద్రవాలు సమతుల్యంలో ఉంటాయి. పొడిని నిత్యం తీసుకుంటే శరీరంలో కొలెస్ట్రాల్‌ తగ్గుతుంది. రక్తనాళాల్లో పేరుకుపోయిన కొవ్వు కరుగుతుంది. దీంతో గుండె జబ్బులు రాకుండా ఉంటాయి. పొడిని తీసుకోవడం వల్ల దంత సమస్యలు పోతాయి. నోటి దుర్వాసన తగ్గుతుంది. నిద్రలేమితో బాధపడేవారు రాత్రి పూట భోజనంతో జాజికాయ పొడి తీసుకుంటే రోజూ రాత్రి చక్కగా నిద్ర పడుతుంది. జాజికాయ నూనె నొప్పులకు బాగా పనిచేస్తుంది. కీళ్ల నొప్పులు, వాపులు తగ్గుతాయి. గుండె ఆరోగ్యాన్ని పెంపొందిస్తుంది. దగ్గు, జలుబు నుంచి ఉపశమనం కలిగిస్తుంది. జాజికాయ, సొంఠి అరగదీసి కణతలకు పట్టు వేస్తే తలనొప్పి, మైగ్రేన్‌ సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. దీనిలోని ‘మినిస్టిసిన్’ అనే పదార్థం మెదడును చురుకుగా ఉంచుతుంది. చర్మం ప్రకాశవంతంగా మెరవాలంటే.. చందనంతో జాజికాయ పొడిని కలిపి ముఖానికి రాసుకోవాలి. మొటిమలు, మచ్చలు సైతం తొలగిపోతాయి. తామర వంటి చర్మ వ్యాధులను కూడా తరిమి కొట్టవచ్చు. శరీరంలోని వ్యర్థాలను బయటకు పంపడంలో జాజికాయ చక్కగా పని చేస్తుంది. కాలేయ, మూత్రపిండ వ్యాధుల నివారణకు జాజికాయ మంచిదని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు. https://t.me/offerbazaramzon

Post a Comment

0Comments

Post a Comment (0)