41 లక్షలకు అమ్ముడైన యాపిల్ కంపెనీ జత బూట్లు !

Telugu Lo Computer
0


ప్రపంచ వ్యాప్తంగా యాపిల్ బ్రాండ్ కు మంచి డిమాండ్ ఉంది. ఈ కంపెనీ ఉత్పత్తులకు ఎంత క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.. యాపిల్ నుంచి ఏ వస్తువు మార్కెట్ లోకి రిలీజ్ అయిన కూడా యూత్ వెంటనే కోనేస్తున్నారు. ఆపిల్ గతంలో తన ఉద్యోగుల కోసం అత్యున్నత టెక్నాలజీతో ఒక నమూనా స్మార్ట్ బూట్లను తయారు చేసింది. కొన్ని కారణాల వల్ల తాజాగా ఈ బూట్లను మార్కెట్లో వేలం పెట్టింది. ఆ బూట్లను 1990ల మధ్యకాలంలో ప్రత్యేకంగా తయారు చేసిన జత బూట్లను కంపెనీ వేలం, బ్రోకరేజీ ద్వారా వేలం పోర్టల్‌లలో ఒకటైన సోథెబీస్‌లో వేలం వేయగా యుఎస్ సైజ్ 10.5లో పురుషుల కోసం తయారైన ఒక జత తెల్లటి బూట్లు ధర $50,000 అంటే సుమారు 41 లక్షల రూపాయలకు అమ్మారన్నమాట. తన ఉద్యోగుల కోసం కస్టమ్-మేడ్, ఈ అల్ట్రా-రేర్ స్నీకర్స్ 90వ దశకం మధ్యలో జరిగిన నేషనల్ సేల్స్ కాన్ఫరెన్స్‌లో ఒక సారి బహుమతిగా కూడా ఇచ్చినట్లు వేలం హౌస్ కంపెనీ సోథెబైస్ తెలిపింది. ఇటీవల వేలంలో యాపిల్‌ ఉత్పత్తులకు విపరీతమైన డిమాండ్‌ పెరిగింది. పాత వస్తువులే అయిన కూడా డిమాండ్ ఎక్కువ..గత నెలలో, ఐఫోన్‌ 2007 మొదటి-ఎడిషన్‌ను $190,000కి విక్రయించగా, యాపిల్‌ సహ వ్యవస్థాపకుడు స్టీవ్ జాబ్స్‌కు చెందిన ఒక జత బిర్కెన్ స్టాక్ చెప్పులు వేలం వేయగా అంతా అవాక్కయ్యేలా $200,000కి అమ్ముడుపోయాయి.   https://t.me/offerbazaramzon

Post a Comment

0Comments

Post a Comment (0)