ఉద్యోగం చేసిన భార్యలు పెళ్లయ్యాక ఇంట్లో ఖాళీగా ఉండకూడదు !

Telugu Lo Computer
0


పెళ్లయ్యాక భార్య ఖాళీగా ఉండకూడదని, భర్త సంపాదన కేవలం ప్రోత్సాహకర మెయింటెనెన్సే అని హైకోర్టు వెల్లడించింది. పెళ్ళికి ముందు ఉద్యోగం చేసిన భార్య పెళ్లయ్యాక ఖాళీగా ఉండకూడదని, మళ్ళీ పని చేయాలని కర్ణాటక హైకోర్టు తీర్పు ఇచ్చింది. ఇంట్లో ఖాళీగా కూర్చుని భర్త నుంచి మొత్తం మెయింటెనెన్స్ డబ్బులు అడగకూడదని హైకోర్టు ఇటీవల తీర్పులో వెల్లడించింది. బెంగళూరు అర్బన్ జిల్లాలోని అనేకల్ పట్టణానికి చెందిన ఒక మహిళ తన భర్త నుంచి విడాకులు తీసుకుంది. అయితే అత్తమామల నుంచి వచ్చిన భరణంలో కోత పెట్టారంటూ ఆమె పిటిషన్ వేసింది. ఈ పిటిషన్ ను న్యాయమూర్తి రాజేంద్ర విచారించారు. గతంలో ఉద్యోగం చేసిన భార్యలు ఇంట్లో ఖాళీగా ఉండకూడదని.. భర్త నుంచి భరణం తీసుకునే మహిళ కూడా ఏదైనా పని చేసుకుని బతకాలని హైకోర్టు సూచించింది. ఆ మహిళ పిటిషన్ ను విచారించిన న్యాయమూర్తి.. తన మాజీ భర్త ఎందుకు అదనపు భరణం ఇవ్వాలన్న ప్రశ్నకు ఆమె నుంచి సరైన సమాధానం రాలేదు. పెళ్లయ్యాక ఎందుకు పని చేయలేకపోయావని ధర్మాసనం ప్రశ్నించగా ఆమె ఏమీ చెప్పలేకపోయింది. పెళ్ళికి ముందు ఉద్యోగం చేసావ్ కదా.. మరి పెళ్లి తర్వాత ఎందుకు చేయలేదన్న ప్రశ్నకు ఆ మహిళ దగ్గర జవాబు లేదు. పెళ్ళికి ముందు ఆ మహిళ ఉద్యోగం చేసి డబ్బు సంపాదించుకుంది. పెళ్లి తర్వాత ఉద్యోగం మానేసి భర్త సంపాదన మీద ఆధారపడింది. భార్య కూడా లీగల్ గా జీవానోపాధి కోసం ప్రయత్నం చేయాలి. భర్త నుంచి సపోర్టివ్ మెయింటెనెన్స్ మాత్రమే ఆశించాలని హైకోర్టు పేర్కొంది. ఆ మహిళ భర్త నుంచి విడిపోయాక పరిహారంగా రూ. 3 లక్షలు, మెయింటెనెన్స్ కింద రూ. 10 వేలు ఇవ్వాలంటూ మేజిస్ట్రేట్ కోర్టు తీర్పు ఇవ్వగా.. సెషన్స్ కోర్టు ఆ భరణాన్ని తగ్గిస్తూ తీర్పు ఇచ్చింది. మెయింటెనెన్స్ ని రూ. 5 వేలకు, పరిహారాన్ని రూ. 2 లక్షలకు తగ్గించింది. అయితే భరణంలో కోత ఉందంటూ సెషన్స్ కోర్టు తీర్పుని ఛాలెంజ్ చేస్తూ హైకోర్టులో పిటిషన్ వేసింది సదరు మహిళ. తనకు భరణం సరిపోదని, సెషన్స్ కోర్టు సరైన న్యాయం చేయకుండా భరణాన్ని తగ్గించిందని ఆమె హైకోర్టులో వాపోయింది. అయితే ఈ పిటిషన్ ను న్యాయమూర్తి కొట్టివేశారు. ఆ మహిళ తన అత్తతో గానీ, మరదలు లేదా వదినతో గానీ ఉండడానికి ఇష్టపడలేదని కోర్టు గమనించింది. మరోవైపు తల్లి, సోదరి సంరక్షణ బాధ్యత భర్తదే కాబట్టి.. దాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ పిటిషన్ ను కొట్టివేసింది.  https://t.me/offerbazaramzon

Post a Comment

0Comments

Post a Comment (0)