ఎగ్జామ్ పేపర్ లీక్‌లకు పాల్పడితే యావజ్జీవ కారాగారం !

Telugu Lo Computer
0


రిక్రూట్‌మెంట్ ఎగ్జామ్ పేపర్ లీక్‌లకు పాల్పడిన వారి శిక్షను 10 ఏళ్ల నుంచి యావజ్జీవ కారాగార శిక్షకు పెంచే బిల్లును వచ్చే అసెంబ్లీ సెషన్‌లో తీసుకురావాలని రాజస్థాన్ ప్రభుత్వం యోచిస్తోంది. ఈ విషయాన్ని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ వెల్లడించారు. రిక్రూట్‌మెంట్ పరీక్షల్లో మోసాలను అరికట్టేందుకు బిల్లును కూడా తీసుకువస్తామని అశోక్ గెహ్లాట్ ప్రకటించారు. 2022 మార్చిలో ప్రభుత్వ పరీక్ష పేపర్ లీక్‌లు, రిక్రూట్‌మెంట్ టెస్ట్‌లలో మోసం వంటి నేరాలకు గరిష్టంగా 10 సంవత్సరాల జైలు శిక్ష , రూ.10 కోట్ల జరిమానా విధించే బిల్లును అసెంబ్లీ ఆమోదించింది. 2021 సెప్టెంబర్ లో REET స్థాయి- రెండు పరీక్ష రద్దు చేయబడిన ఒక నెల తర్వాత ఇది జరిగింది. ప్రస్తుతం రాజస్థాన్ పోలీసుల స్పెషల్ ఆపరేషన్ గ్రూప్ దర్యాప్తు చేస్తున్న రీట్ పేపర్ లీక్ కేసుపై సీబీఐ విచారణకు ప్రతిపక్ష బీజేపీ డిమాండ్ చేసింది. పేపర్ లీకేజీ వ్యవహారంపై రాజస్థాన్‌లోని విపక్షాలు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తున్నాయి. ఈ ఏడాది చివర్లో రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి.  https://t.me/offerbazaramzon

Post a Comment

0Comments

Post a Comment (0)