సూర్యనారాయణపై సస్పెన్షన్ వేటు !

Telugu Lo Computer
0


ఆంధ్రప్రదేశ్ లో ఉద్యోగుల సమస్యలపై గతంలో గవర్నర్ ను కలిసి ఫిర్యాదు చేసి వార్తల్లోకి వచ్చిన ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు కేఆర్ సూర్యనారాయణపై జగన్ సర్కార్ కన్నెర్ర చేసింది. అప్పటి నుంచి ప్రభుత్వానికీ, ఆయనకూ మధ్య సాగుతున్న పోరు తాజాగా మరో మలుపు తిరిగింది. వాణిజ్య పన్నుల శాఖలో సూపరింటెండెంట్ గా పనిచేస్తున్న ఆయన అవినీతి,అక్రమాలకు పాల్పడ్డారంటూ ఇప్పటికే కేసు నమోదు చేసిన ప్రభుత్వం.. తాజాగా ఆయనపై సస్పెన్షన్ వేటు వేసింది. కేఆర్ సూర్యనారాయణపై పూర్తి స్ధాయిలో క్రమశిక్షణ చర్యలు తీసుకునే వరకూ సస్పన్షన్ వేటు కొనసాగుతుందని ప్రభుత్వం ఈ నెల 21న జారీ చేసిన ఉత్తర్వుల్లో పేర్కొంది. ఏపీ వాణిజ్య పన్నుల శాఖ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడిగా కూడా ఉన్న కేఆర్ సూర్యనారాయణతో కలిసి ఇతర నిందితులు భారీ మొత్తంలో వ్యాపారులు నుంచి తనిఖీల పేరుతో డబ్బులు వసూలు చేశారని ప్రభుత్వం సస్పెన్షన్ ఉత్తర్వుల్లో తెలిపింది. సూర్యనారాయణ ఉద్యోగంలో కొనసాగితే విచారణ సజావుగా సాగదని, అలాగే ప్రభుత్వానికి కూడా హాని కలిగే అవకాశం ఉందంటూ ఉత్తర్వుల్లో పేర్కొంది. ప్రభుత్వ ఉద్యోగిగా ఉంటూనే విచారణకు సహకరించకపోవడంతో ఆయన్ను సస్పెండ్ చేస్తున్నట్లు తెలిపింది. https://t.me/offerbazaramzon

Post a Comment

0Comments

Post a Comment (0)