ప్రపంచంలోనే ఎత్తయిన దర్వాజా !

Telugu Lo Computer
0


ప్రపంచంలోని అత్యంత ఎత్తయిన దర్వాజా పేరు బులంద్‌ దర్వాజా. ఇది ఉత్తరప్రదేశ్‌లోని ఫతేపూర్‌ సిక్రీలో ఉంది. ఈ దర్వాజా ఎత్తు 53.63 మీటర్లు. అంటే దీనిని అడుగులలో కొలిస్తే 173 అడుగుల కన్నా అధికంగా ఉంటుంది. ఈ దర్వాజా వెడల్పు 35 మీటర్లు. రెడ్‌శాండ్‌ స్టోన్‌తో రూపొందిన ఈ దర్వాజా నేటికీ చెక్కుచెదరకుండా ఉండటం విశేషం. ఈ రాయితో చెక్కిన వివిధ ఆకృతులు ఈ దర్వాజాపై కనిపిస్తాయి. ఈ దర్వాజాపై పలు గుమ్మటాలు, మీనార్‌లు కూడా కనిపిస్తాయి. ఈ దర్వాజాను చూసేందుకు ప్రతీ యేటా లక్షలాది మంది ఫతేపూర్‌ సిక్రీ వస్తుంటారు. చరిత్రకారులు తెలిపిన వివరాల ప్రకారం ఈ దర్వాజాను మొఘల్‌ పరిపాలకుడు అక్బర్‌ 1602లో తీర్చిద్దారు. అక్బర్‌ గుజరాత్‌పై విజయం సాధించినందుకు స్మృతి చిహ్నంగా దీనిని నిర్మించారు. ఈ దర్వాజాపై కనిపించే తోరణంలో పార్సీ భాషలోని అక్షరాలు కనిపిస్తాయి. సమాజానికి ఐక్యతను చాటేందుకే అక్బర్‌ ఈ దర్వాజాను తీర్చిదిద్దారని చెబుతారు. ఈ భావనికి సంబంధించిన అక్షరాలు ఈ దర్వాజాపై కనిపిస్తాయి. ఈ దర్వాజాను రూపొందించేందుకు 12 సంవత్సరాలు పట్టింది. క్రీస్తుపూర్వం 1571 నుంచి 1558 వరకూ మెఘల్‌ సామ్రాజ్యానికి ఫతేపూర్‌ సిక్రీ రాజధానిగా ఉండేది.  https://t.me/offerbazaramzon

Post a Comment

0Comments

Post a Comment (0)