ఐఆర్‌సీటీసీ అమేజింగ్ అండమాన్ !

Telugu Lo Computer
0

                                              

హైదరాబాద్ నుంచి అండమాన్ టూర్ వెళ్లాలనుకునేవారికి ఐఆర్‌సీటీసీ టూరిజం ప్రత్యేక టూర్ ప్యాకేజీ ప్రకటించింది. అమేజింగ్ అండమాన్ పేరుతో హైదరాబాద్ నుంచి ఫ్లైట్ టూర్ ఆపరేట్ చేస్తోంది. ఇది 5 రాత్రులు, 6 రోజుల టూర్ ప్యాకేజీ. ఈ టూర్ ప్యాకేజీలో హేవ్‌లాక్, పోర్ట్‌బ్లెయిర్‌లోని పర్యాటక ప్రాంతాలు కవర్ అవుతాయి. తెల్లటి ఇసుక బీచ్‌లు, మడ అడవులు, రెయిన్ ఫారెస్ట్ చూడొచ్చు. బోటులో షికార్ కూడా చేయొచ్చు. 2023 ఆగస్టు18న ఈ టూర్ ప్రారంభం అవుతుంది. ఐఆర్‌సీటీసీ అమేజింగ్ అండమాన్ టూర్ మొదటి రోజు హైదరాబాద్‌లో ప్రారంభం అవుతుంది. తెల్లవారుజామున 5.35 గంటలకు హైదరాబాద్‌లో ఫ్లైట్ ఎక్కితే మధ్యాహ్నం 1.10 గంటలకు పోర్ట్‌బ్లెయిర్ చేరుకుంటారు. అక్కడ నుంచి హోటల్‌కి తీసుకెళ్తారు. కాసేపు విశ్రాంతి తీసుకున్న తర్వాత కార్బిన్స్ కోవ్ బీచ్ చూడొచ్చు. ఆ తర్వాత సెల్యులార్ జెయిల్ సందర్శన ఉంటుంది. సెల్యులార్ జెయిల్‌లో లైట్ అండ్ సౌండ్ షో కూడా చూడొచ్చు. రాత్రికి పోర్ట్‌బ్లెయిర్‌లో బస. రెండో రోజు రాస్ ఐల్యాండ్, నార్త్ బే ఐల్యాండ్ టూర్ ఉంటుంది. వాటర్ స్పోర్ట్స్ యాక్టివిటీస్‌లో పాల్గొనొచ్చు. స్క్యూబా డైవింగ్, గ్లాస్ బాటమ్ బోట్ రైడ్ ఎంజాయ్ చేయొచ్చు. సాయంత్రం షాపింగ్ కోసం ఖాళీ సమయం ఉంటుంది. రాత్రికి పోర్ట్ బ్లెయిర్‌లో బస చేయాలి. మూడో రోజు హేవ్‌లాక్ టూర్ ఉంటుంది. క్రూజ్ ద్వారా హెవ్‌లాక్ చేరుకోవాలి. ఆ తర్వాత కాలాపత్తర్, రాధానగర్ బీచ్ చూడొచ్చు. రాత్రికి హేవ్‌లాక్‌లో బస. నాలుగో రోజు నీల్ ఐల్యాండ్‌కు క్రూజ్‌లో తీసుకెళ్తారు. భరత్‌పూర్ బీచ్, నేచురల్ బ్రిడ్జి, లక్ష్మణ్ బీచ్ చూడొచ్చు. లక్ష్మణ్ బీచ్‌లో సూర్యాస్తమయాన్ని ఎంజాయ్ చేయొచ్చు. రాత్రికి రిసార్ట్‌లో బస చేయాలి. ఐదో రోజు పోర్ట్ బ్లెయిర్‌కు క్రూజ్‌లో బయల్దేరాలి. రాత్రికి పోర్ట్ బ్లెయిర్‌లో బస చేయాలి. ఆరో రోజు తిరుగు ప్రయాణం ప్రారంభం అవుతుంది. మధ్యాహ్నం 2 గంటలకు పోర్ట్‌బ్లెయిర్‌లో ఫ్లైట్ ఎక్కితే రాత్రి 7.45 గంటలకు హైదరాబాద్ చేరుకోవడంతో టూర్ ముగుస్తుంది. ఐఆర్‌సీటీసీ అమేజింగ్ అండమాన్ టూర్ ప్యాకేజీ ధర ఒకరికి ట్రిపుల్ ఆక్యుపెన్సీకి రూ.45,540, డబుల్ ఆక్యుపెన్సీకి రూ.45,830, సింగిల్ ఆక్యుపెన్సీకి రూ.58,440 చెల్లించాలి. టూర్ ప్యాకేజీలో ఫ్లైట్ టికెట్స్, ఏసీ హోటల్‌లో బస, ఏసీ వాహనంలో సైట్ సీయింగ్, క్రూజ్ ఛార్జీలు, బ్రేక్‌ఫాస్ట్, డిన్నర్ కవర్ అవుతాయి. https://t.me/offerbazaramzon


Post a Comment

0Comments

Post a Comment (0)