అవసరమైతే హెలికాప్టర్‌లు వాడండి !

Telugu Lo Computer
0


తెలంగాణ లో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో వైద్యారోగ్య శాఖ పూర్తిస్థాయిలో అప్రమత్తంగా ఉండాలని ఆర్థిక, వైద్యారోగ్యశాఖల మంత్రి హరీశ్‌రావు ఆదేశించారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆదేశాల మేరకు ఏజెన్సీ ప్రాంతాల్లో ప్రజలకు ఎమర్జెన్సీ వైద్యసేవలు అందించేందుకు అవసరమైతే హెలికాప్టర్‌ను వినియోగిస్తామని చెప్పారు. గురువారం ఆయన వైద్యారోగ్యశాఖ సన్నద్ధత, ప్రజారోగ్య పరిరక్షణకు తీసుకోవలసిన చర్యలపై అన్ని విభాగాల ఉన్నతాధికారులు, జిల్లా వైద్యాధికారులతో సచివాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. సందర్భంగా హరీశ్‌రావు మాట్లాడుతూ.. ఎడతెరిపి లేని వర్షాల నేపథ్యంలో ప్రజలకు వైద్యసేవల విషయంలో అంతరాయం లేకుండా చూడాలని సూచించారు. ప్రజలకు నిరంతర వైద్యసేవలు అందించేందుకు రాష్ట్ర స్థాయిలో స్టేట్‌ లెవల్‌ కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌ 040-24651119 ను ఏర్పాటుచేసినట్టు తెలిపారు. ఇదే తరహాలో జిల్లా స్థాయిలో కాల్‌ సెంటర్‌, జిల్లా, ఏరియా, సీహెచ్‌సీ, ఎంసీహెచ్‌ దవాఖానల వారీగా ఎమర్జెన్సీ వైద్యసేవలు అందించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని సూచించారు. 108, 102 వాహన సేవలు పూర్తి స్థాయిలో వినియోగించాలని, ప్రసవ తేదీ సమీస్తున్న గర్భిణులకు, డయాలసిస్‌ పేషెంట్లకు అవసరమైన వైద్యసేవలు అందేలా చూడాలని కోరారు. ఆహారం కలుషితం కాకుండా ఆహార నాణ్యతపై దృష్టి సారించాలని, మెడికల్‌ ఆఫీసర్లు తమ పరిధిలోని అన్ని రకాల ప్రభుత్వ హాస్టళ్లను సందర్శించాలని ఆదేశించారు. https://t.me/offerbazaramzon

Post a Comment

0Comments

Post a Comment (0)