దేశవ్యాప్తంగా భారీ వర్షాలు !

Telugu Lo Computer
0


దేశవ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. దేశంలోని 20 రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురువనున్నాయి. మరో మూడు రోజులపాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ సూచించింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, ఒడిశా, మహారాష్ట్ర, గోవా, తమిళనాడు, కేరళ, పుదుచ్చేరి, ఢిల్లీ, హర్యానా, పంజాబ్, జమ్మూకాశ్మీర్, పశ్చిమ ఉత్తర ప్రదేశ్, తూర్పు రాజస్థాన్, పశ్చిమ మధ్యప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, పశ్చిమ బెంగాల్ , సిక్కింలో భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండి వెల్లడించింది. భారీ వర్షాల కారణంగా రానున్న రెండు రోజుల పాటు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌, కర్ణాటక రాష్ట్రాలకు ఐఎండి రెడ్ అలర్ట్ ప్రకటించింది. తెలంగాణలోని నిజామాబాద్ జిల్లాలో 24 గంటల్లో 40 సెంటి మీటర్ల వర్షపాతం నమోదు అయింది. బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడడంతో కోస్తా ఆంధ్ర ప్రదేశ్‌, కర్ణాటక, ఒడిశాలోని తీర ప్రాంత జిల్లాల్లో భారీ వర్షాలు కురవనున్నాయి. దక్షిణ కన్నడ, ఉడిపి, ఉత్తర కన్నడ, చిక్కమగళూరు, కొడగు, శివమొగ్గ జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. మహారాష్ట్రలో రాయ్‌గఢ్, పూణే, సతారా, రత్నగిరి జిల్లాలకు ఐఎండి బుధవారం రెడ్ అలర్ట్ ప్రకటించింది. రాయ్ ఘడ్ జిల్లాలో పాఠశాలలకు ప్రభుత్వం సెలవులు ప్రకటించింది. ముంబై, పాల్ఘర్, థానే జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఢిల్లీ-ఎన్సీఆర్ లో రానున్న నాలుగైదు రోజుల్లో సాధారణ వర్షాలు కురుస్తాయని ఐఎండి అంచనా వేసింది. ఢిల్లీ-ఎన్‌సిఆర్, నోయిడా, గురుగ్రామ్ లో భారీ వర్షంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. నోయిడాలో పాఠశాలలు మూతపడ్డాయి. హిందోన్ నది ఉధృతంగా ప్రవహిస్తుండటంతో నోయిడా, గౌతమ బిడ్డనగర్, ఘజియబాద్, సైబబాద్ ప్రాంతాల్లో ఇళ్ళు నీట మునిగిగాయి. నోయిడా ఈకో టెక్ ప్రాంతంలో వందలాది కార్లు నీట మునిగాయి. గురువారం ఢిల్లీ, హర్యానా, చండీగఢ్, పశ్చిమ ఉత్తరప్రదేశ్, తూర్పు రాజస్థాన్, పశ్చిమ మధ్యప్రదేశ్, సబ్-హిమాలయన్ పశ్చిమ బెంగాల్ లో ఉరుములతో కూడిన భారీ వర్షాలు పడనున్నాయి.https://t.me/offerbazaramzon

Post a Comment

0Comments

Post a Comment (0)