ఆవును ఢీకొట్టిన వందే భారత్ రైలు

Telugu Lo Computer
0


గుజరాత్ లోని గాంధీనగర్ నుంచి మహారాష్ట్ర లోని ముంబై సెంట్రల్ మధ్య నడిచే వందే భారత్ రైలు (నంబర్ 20902) ఆవును  ఢీకొట్టింది. ఈ ఎక్స్‌ప్రెస్ రైలు ఉంబెర్‌గావ్-ఘోల్వాడ్ సెక్షన్ గుండా వేగంగా వెళుతున్నప్పుడు సుమారు 7గంటల ప్రాంతంలో సంభవించినట్టు సమాచారం. అయితే కేవలం 10 నిమిషాల్లోనే అధికారులు ఆ ప్రాంతాన్ని క్లియర్ చేశారు. ఈ ఘటనలో హైటెక్ రైలుకు ఎటువంటి నష్టం జరగలేదు. కాకపోతే రైలు ముందు భాగం కాస్త దెబ్బ తిన్నట్టు తెలుస్తోంది. అనంతరం ఇలాంటి ఘటనలను అరికట్టేందుకు 378 మీటర్ల మేర కాకుండా మొత్తం మార్గంలో కంచె ఏర్పాటు చేసినట్లు రైల్వే అధికారి తెలిపారు. ఇలా వందే భారత్ రైలు, ఆవును ఢీకొట్టడం అన్నది ఇటీవలి కాలంలో సర్వసాధారణంగా మారిపోయింది. దాదాపు 100 కిలోమీటర్ల వేగంతో పరుగులు తీస్తున్న వందే భారత్ ఎక్స్ ప్రెస్ లకు అడ్డుగా జంతువులు రావడం, వాటిని తప్పించేందుకు అవకాశం లేని పరిస్ధితుల్లో గుద్దేయడం. ఇప్పటికే పలు రాష్ట్రాల్లో వందే భారత్ రైళ్లు ఆవుల్ని, గేదెల్ని గుద్దేసి డ్యామేజ్ అవుతున్న ఘటనలు చూస్తూనే ఉన్నాం. ఇటీవల మధ్యప్రదేశ్ లోని గ్వాలియర్ లోనూ అలాంటి ఘటనే చోటు చేసుకుంది. https://t.me/offerbazaramzon


Post a Comment

0Comments

Post a Comment (0)