సెల్ ఫోన్ టవర్స్ కన్నా వలస పక్షుల ప్రాణాలే మిన్న!

Telugu Lo Computer
0


త్తీస్‌గఢ్‌ రాష్ట్రంలోని గరియాబంద్ జిల్లా లచ్కెరా గ్రామస్తులు తమ గ్రామంలో సెల్ ఫోన్ టవర్ ఏర్పాటును అడ్డుకున్నారు. తమకు ఇంటర్నెట్ కనెక్టివిటీ అక్కర లేదని వాళ్ళు తేల్చి చెప్పారు. ఊరిలో సెల్ ఫోన్ టవర్ ఏర్పాటుకు ఏ కంపెనీ వచ్చినా అడ్డుకుంటామని చెబుతున్నారు. వారు తీసుకున్న ఈ నిర్ణయం తమ ఆరోగ్యాలను కాపాడుకోవాలనే తాపత్రయం కాదు, గ్రామంలోకి వలస వచ్చే పక్షుల కోసం. దాని కోసం  మా గ్రామంలో మొబైల్ టవర్ల ఏర్పాటుకు పర్మిషన్ లేదని చెబుతూ తీర్మానం కూడా చేశారు.  ప్రతి సంవత్సరం వర్షాకాలంలో చైనా, థాయ్ లాండ్, బర్మా, ఇండోనేషియా నుంచి ఈ గ్రామానికి వందలాది ఏషియన్ ఓపెన్‌బిల్ జాతి కొంగలు వలస వస్తుంటాయి. లచ్కెరా గ్రామంలోని చెట్లపై ఈ కొంగలు గూళ్ళు కట్టుకొని గుడ్లు పెట్టి సంతానోత్పత్తి చేస్తాయి. ఈ క్రమంలో తమ ఊరిలోని చెరువులో ఉన్న నీటి పాములు, కప్పలు, కీటకాలను అవి తింటాయి. అవి ఇక్కడ సంతానోత్పత్తి చేసుకొని, తమ పిల్లలతో కలిసి దీపావళి పండుగ తర్వాత వెళ్లిపోతాయని గ్రామస్తులు చెబుతున్నారు. సెల్ టవర్స్ ఏర్పాటు ఈ పక్షుల సంతానోత్పత్తి ప్రక్రియకు ప్రమాదం పొంచి ఉందని గ్రామస్తులు భయపడుతున్నారు. ఈ కారణాలతో తమ ఊరిలో సెల్ ఫోన్ టవర్స్ ఏర్పాటు చేయొద్దని హెచ్చరిస్తున్నారు. ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని లచ్కెరా గ్రామ సర్పంచ్ వెల్లడించారు. మా ఊరికి ఇంటర్నెట్ కనెక్షన్ వీక్ గా ఉన్న పర్లేదు.. కానీ మా ఊరిని నమ్ముకొని వలస వచ్చే పక్షుల ప్రాణాలకు ప్రమాదం కలగడానికి వీల్లేదని ఆయన తేల్చి చెప్పారు. ఊళ్లో ఎవరైనా వలస పక్షులకు హాని కలిగిస్తే, వారికి రూ.1,000 జరిమానా విధిస్తున్నట్లు తెలిపారు. https://t.me/offerbazaramzon

Post a Comment

0Comments

Post a Comment (0)