మణిపూర్‌, కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా సుప్రీంకోర్టులో పిటిషన్‌ వేసిన మణిపూర్‌ బాధితులు !

Telugu Lo Computer
0


ణిపూర్‌లో లైంగిక వేధింపులకు గురైన ఇద్దరు మహిళలు మణిపూర్‌, కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా సోమవారం సుప్రీంకోర్టులో పిటిషన్‌ వేశారు. తమ గోప్యతకు భంగం వాటిల్లకుండా భద్రత కల్పించాలని పిటిషన్‌లో కోరారు. ఆ ఇద్దరు బాధితులను కోర్టు పత్రాల్లో ఎక్స్‌, వై గా పేర్కొన్నారు. ఐజి ర్యాంక్‌ పోలీస్‌ అధికారి నేతృత్వంలో ప్రత్యేక దర్యాప్తు బృందంతో స్వతంత్ర దర్యాప్తు చేపట్టాలని, విచారణను రాష్ట్రం వెలుపలకు బదిలీ చేయాలని కోరారు. రాష్ట్ర పోలీసులపై విశ్వాసం లేదని పేర్కొంటూ, తమకు భద్రత కల్పించాలని, సిఆర్‌పిసిలోని సెక్షన్‌ 164 కింత తమ వాంగ్మూలాన్ని రికార్డ్‌ చేయాల్సిందిగా సమీప ప్రాంత మెజిస్ట్రేట్‌ను ఆదేశించాలని కోరారు. ఈ కేసును కేంద్రం సిబిఐకి అప్పగించడంతో.. సిబిఐకి ఎందుకు అప్పగించాల్సి వచ్చిందో కారణాలు చేప్తూ సుప్రీంకోర్టులో అఫిడవిట్‌ దాఖలు చేసింది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి డివై. చంద్రచూడ్‌ నేతృత్వంలోని ధర్మాసనం నేడు ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టే అవకాశం ఉంది. మే 4న విడుదలైన ఈ వీడియోను సుప్రీంకోర్టు సుమోటోగా స్వీకరించిన సంగతి తెలిసిందే. https://t.me/offerbazaramzon

Post a Comment

0Comments

Post a Comment (0)