పార్లమెంట్‌ ను కుదిపేసిన మణిపూర్‌ అంశం !

Telugu Lo Computer
0


పార్లమెంట్ వర్షాకాల సమావేశాల కార్యకలాపాలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది. సోమవారం కూడా మణిపూర్‌  అంశం కుదిపేసింది. దాంతో లోక్‌సభ మధ్యాహ్నం రెండు గంటల వరకు వాయిదా పడింది. అలాగే రాజ్యసభ కార్యకలాపాలు మధ్యాహ్నం 12 గంటలవరకు నిలిచిపోయాయి. ఈ సమావేశాలకు ముందు పార్లమెంట్‌కు వచ్చిన ప్రధాని మోడీ కేంద్రమంత్రులతో సమావేశమయ్యారు. అలాగే ప్రతిపక్షాల కూటమి ఇండియా సభ్యులు కూడా భేటీ అయ్యారు. రెండురోజుల పాటు మణిపూర్‌లో పర్యటించిన నేతలు ఈ సమావేశంలో పాల్గొన్నారు. అనంతరం మొదలైన సమావేశాలను మణిపూర్‌ అంశం కుదిపేసింది. దాంతో దిగువసభ మధ్యాహ్నం రెండువరకు వాయిదా పడింది. రాజ్యసభ సభాపక్ష నేత పీయూష్ గోయల్‌ మాట్లాడుతూ.. 'మధ్యాహ్నం రెండు గంటలకు రాజ్యసభలో మణిపూర్ అంశాన్ని చర్చించాలని మేం కోరుకుంటున్నాం. సభ్యులకు ఇచ్చిన స్వేచ్ఛను విపక్ష ఎంపీలు దుర్వినియోగం చేసేలా ప్రవర్తిస్తున్నారు. చర్చకు ప్రభుత్వం సిద్ధంగా ఉన్నా.. వారు ఈ సెషన్‌లో 9 రోజులను వృథా చేశారు' అని గోయల్‌ వెల్లడించారు. ఈ క్రమంలో విపక్షాల నిరసనల మధ్య రాజ్యసభ వాయిదా పడింది.  https://t.me/offerbazaramzon

Post a Comment

0Comments

Post a Comment (0)