వచ్చే ఎన‍్నికల్లో జేడీఎస్ పార్టీ ఒంటరిగానే పోటీ చేస్తుంది !

Telugu Lo Computer
0


ర్ణాటకలో జేడీఎస్‌(జనతా దళ్ (సెక్యులర్)) పార్టీ గత అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీతో పొత్తును కొనసాగించింది. కానీ రాష్ట్రంలో బీజేపీ ఓటమి తర్వాత జేడీఎస్ పార్టీ భవిష్యత్తుపై పునరాలోచనలో పడింది. బీజేపీతో కలిసే వచ్చే లోక్‌సభ ఎన్నికల్లోనూ పోటీ చేయనున్నారని వార్తలు వచ్చిన నేపథ్యంలో పార్టీ అధినేత దేవె గౌడ స్పందించారు. వచ్చే ఎన్నికల్లో తాము ఒంటరిగానే పోటీ చేయనున్నామని జనతా దళ్ (సెక్యులర్) అధినేత హెచ్‌డీ దేవె గౌడ తెలిపారు. దీంతో బీజేపీతో జేడీఎస్ పొత్తు కొనసాగించనుందనే అంశానికి తెరపడింది. రాష్ట్రంలో కొత్తగా కొలువుదీరిన కాంగ్రెస్ ప్రభుత్వంపై బీజేపీతో కలిసి జేడీఎస్ పోరాడుతుందని దేవె గౌడ కుమారుడు కుమారస్వామి గత వారం తెలిపాడు. దీంతో వచ్చే లోక్‌సభ ఎన్నికల్లోనూ జేడీఎస్.. బీజేపీతో కలిసే పోటీ చేయనుందనే ఊహాగానాలు వెల్లువెత్తాయి. ఇటీవల రాష్ట్ర అసెంబ్లీ సమావేశాల్లోనూ ఐఏఎస్‌ల బదిలీల అంశంలో బీజేపీ నేతలతో పాటు జేడీఎస్ సభ్యులు కూడా పోరాడారు. ఈ క్రమంలో పలువురు నేతలు అసెంబ్లీ నుంచి సస్పెండ్ కూడా అయ్యారు. ఈ అంశాల అనంతరం బెంగళూరులో మీడియా సమావేశం అనంతరం మాట్లాడిన దేవె గౌడ వచ్చే ఎన‍్నికల్లో తమ పార్టీ ఒంటరిగానే పోటీ చేయనుందని స్పష్టం చేశారు. ఒక్క సీటు గెలిచినా పర్వాలేదు, కానీ తాము తప్పకుండా ఒంటరిగా ఎన్నికల బరిలో దిగుతామని అన్నారు. తమకు ప్రాబల్యం ఉన్న స్థానాల్లో మాత్రమే పోటీ చేయనున్నట్లు చెప్పారు. పార్టీ కార్యకర్తలతో చర్చించి ఆయా స్థానాలను నిర్ణయిస్తామని తెలిపారు.  https://t.me/offerbazaramzon

Post a Comment

0Comments

Post a Comment (0)