అద్దె ఇంటి కోసం ఏకంగా ₹25 లక్షలు డిపాజిట్ చేయాలట !

Telugu Lo Computer
0


బెంగళూరు మహానగరం అంటే వెంటనే గుర్తొచ్చేది రద్దీ రోడ్లు, ట్రాఫిక్ ఇబ్బందులు. ఇంకా చెప్పాలంటే అక్కడి ఇంటి అద్దెలు. పైగా డిపాజిట్‌ సైతం భారీగా చెల్లించాల్సి ఉంటుంది. పైగా ఇళ్లు దొరకటమూ కష్టమే. ఇటీవల బెంగళూరులో ఓ వ్యక్తి ఇంటి కోసం యాప్‌ సాయంతో వెతుకుతుంటే  అద్దె కోసం ఏకంగా రూ.25లక్షలు చెల్లించాలని రాసి ఉంది. అది చూసి అవాక్కైన ఆ వ్యక్తి సామాజిక మాధ్యమాల్లో పంచుకోవడంతో విషయం వైరల్‌గా మారింది. బెంగుళూరులో ఇంటి కోసం తేజశ్వినీ శ్రీవాస్తవ అనే వ్యక్తి నో బ్రోకరేజ్‌ యాప్‌ను సంప్రదించాడు. అందులో లిస్ట్‌ అయిన ఇళ్లను వెతకటం మొదలుపెట్టాడు. అలా చూస్తున్న సమయంలో HSR లేఅవుట్‌లో 5,195 చదరపు అడుగుల విస్తీర్ణంలో 4-BHK ఫ్లాట్‌ కనిపించింది. దాని అద్దె ఏకంగా రూ.2,50,000గా ఉండడంతో ఆశ్చర్యపోయాడు. మరింత దిగువకు వెళితే అక్కడ ముందుగా రూ.25 లక్షలు సెక్యూరిటీ డిపాజిట్‌ చేయాలని అది చూసి అతడికి నోటి మాట రాలేదు. ఆ సెక్యూరిటీ డిపాజిట్‌ చెల్లించటం కోసం లోన్‌ ఆప్షన్‌ కూడా కనిపించడంతో అతడికి చిర్రెత్తుకొచ్చింది. దీంతో 'కిడ్నీ దానం చేయడానికి ఆప్షన్‌ కూడా ఇస్తే బాగుండు' అంటూ కామెంట్‌ జోడించి ఆ స్క్రీన్‌ షాట్‌ను సామాజిక మాధ్యమాల ద్వారా పంచుకున్నాడు. దీంతో ఈ పోస్ట్‌ సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది. నెటిజన్లు సైతం దీనిపై స్పందిచారు. కొందరు ఇంటి అద్దెపై తమ ఆగ్రహాన్ని వెలిబుచ్చగా.. మరికొందరు రుణం కోసం దరఖాస్తు చేసుకోవడంపై మండిపడ్డారు. 'అసలేంటిది? సెక్యూరిటీ డిపాజిట్ల పేరుతో రుణాలను అమ్ముకుంటారా? అసలు మనం ఎలాంటి ప్రపంచంలో బతుకుతున్నాం' అంటూ ఓ వ్యక్తి కోపంతో కామెంట్‌ చేశాడు. చివరి రెండు సున్నాల ముందు చుక్క పెట్టడం మరిచిపోయారేమో అంటూ మరో వ్యక్తి వ్యంగ్యంగా కామెంట్‌ పెట్టాడు. https://t.me/offerbazaramzon

Post a Comment

0Comments

Post a Comment (0)