టికెట్‍లో 10 శాతం రాయితీ

Telugu Lo Computer
0


టీఎస్ ఆర్టీసీ ఆదాయం పెంచుకునే దిశగా చర్యలు చేపడుతుంది. ఇప్పటికే పలు రూట్లలో డైనమిక్ ప్రైసింగ్ విధానం తీసుకురావాలని చూస్తోంది. తాజాగా జంట నగరాలకు సంబంధించి ఆర్టీసీ ఓ నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయంలో భాగంగా శంషాబాద్ ఎయిర్ పోర్టుకు వెళ్లే ప్రయాణికులకు శుభవార్త చెప్పింది. ఎయిర్ పోర్టుకు వెళ్లే వారి సంఖ్య ముగ్గురి కంటే ఎక్కువు ఉంటే  టికెట్లపై 10 శాతం వరకు రాయితీ ఇవ్వనుంది. ముగ్గురికి మించి ఎంత మంది ప్రయాణం చేసిన టికెట్ల 10 శాతం సబ్సిడీ ఉంటుందని ఆర్టీసీ ప్రకటించింది. ప్రైవేట్ వాహనాల పోటీ తట్టుకునేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. హైదరాబాద్ లోని పలు మార్గాల్లో విమానాశ్రయానికి వెళ్లడానికి రూ. 50 నుంచి రూ.300 వరకు వసూలు చేస్తున్నారు. ఈ ధరలు బస్సు బట్టి మారుతుంటాయి. ఎయిర్ పోర్టుకు మరో 20 ఏసీ బస్సులు నడిపేందుకు ఆర్టీసీ సిద్ధమైంది. జంట నగరాల్లో ఆదాయం పెంచుకునేందుకు ఆర్టీసీ చాలా నిర్ణయాలు తీసుకుంది. ఇందులో భాగంగా టీ 24 టికెట్ తీసుకొచ్చింది. ఈ టికెట్ తీసుకుని 24 గంటల పాటు సిటీలో ఎటైనా వెళ్లొచ్చు. ప్రస్తుతం ఈ టికెట్ కేవలం రూ.100 అందిస్తున్నారు. మహిళల, వృద్ధులకు రాయితీ కూడా ఇస్తున్నారు. అలాకే రూ.50 లకే టీ 6 టికెట్ తీసుకొచ్చారు. ఈ టికెట్ తీసుకుంటే ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ప్రయాణం చేయ్యొచ్చు.  https://t.me/offerbazaramzon

Post a Comment

0Comments

Post a Comment (0)